- వర్షాల వల్ల రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం
- గోతాలు, రవాణా సమస్యకు వెసులుబాటు కల్పిస్తాం
- ఇప్పటివరకు 4,50,000 మెట్రిక్ టన్నుల సేకరణ
- చెల్లింపుల్లో రూ.1100 కోట్ల మైలురాయి దాటాం
- పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
- కంకిపాడు మండలంలో రైతు సేవా కేంద్రాల పరిశీలన
కంకిపాడు(చైతన్యరథం): కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నామో వారికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా 24 నుంచి 48 గంటల్లోపే కల్లాల దగ్గర ఉన్న ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పునాదిపాడు, కోలవెన్ను రైతు సేవా కేంద్రాలను మంగళవారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు విషయంలో గత సంవ త్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. వర్షాలు, తుఫాన్ పరిస్థితులు ఉండటం వల్ల రైతులు ఆవేదన చెందుతున్న సందర్భంలో మిల్లుల వద్దకు హడావిడిగా తరలించే ప్రయత్నంలో గోతాలు, రవాణా సమస్యలు అధిగమించడానికి అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందని వివరించారు.
కచ్చితంగా రైతుకు ప్రాధాన్యమిచ్చి వారి కోరిన విధంగా వారికి అందుబాటులో దగ్గరలో ఉన్న మిల్లులకు తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించామని వెల్ల డిరచారు. స్థానికంగా సమస్యలు ఉన్నప్పుడు స్పందించడానికి ప్రభుత్వ యంత్రాంగం రైతులకు అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో మొట్టమొదటిసారి రూ.1100 కోట్ల మైలు రాయి దాటామని, అందులో 93 శాతం 24 గంటల్లోపే ధాన్యం కొనుగోలు చేయగానే రైతు ఖాతాల్లో జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసి కొన్ని సంస్కరణలను తీసుకొచ్చామని వివరించారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది..
మన రాష్ట్రంలో అనేకమంది కౌలు రైతులు కాబట్టి వారికి నష్టం కలగకుండా చూసే బాధ్యత తమపై ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు, కౌలు రైతుల విషయంలో పవన్‌కళ్యాణ్ చేసిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. అనంతరం కంకి పాడు మండలం దావులూరు గ్రామంలోని బాలాజీ రైస్‌మిల్లును మంత్రి సందర్శించారు. అక్కడ రైతు సమస్యలను విని మిల్లు యజమానులు రైతులకు సహకరించాలని సూచించారు.