- దగదర్తి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తాం
- మత్స్యకారులకు బోట్లు అందించేందుకు చర్యలు
- నెల్లూరు జిల్లాలో పెండిరగ్ ప్రాజెక్టులపై దృష్టి పెడతాం
- సీఎం దృష్టికి తీసుకెళ్లి పనులపై ముందుకెళతాం
- జగన్ పాలనలో ప్రాజెక్టులను అటకెక్కించారు
- మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు జిల్లా, జువ్వలదిన్నె(చైతన్యరథం): మత్స్యకారుల సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలి క సదుపాయాల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను శుక్రవారం వారు పరిశీలించారు. నిలిచిపోయిన పనులు, పూర్తయిన పనుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతంలో అనేకమంది మత్స్యకారులు ఉపాధి కోల్పోతారనే ముందు చూపుతో చంద్రబాబు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పనులను ఎక్కడిక క్కడ నిలిపేశారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెండిరగ్ ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని, జగన్‌రెడ్డి పాలనలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారన్నారు.
జువ్వలదిన్నె హార్బర్ వద్ద నిలిచిపోయిన ప్రతి పనికి సంబంధించి అధికారుల వద్ద పూర్తిస్థాయి వివరాలు సేకరించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని వివరించారు. రానున్న మూడు నెలల్లో పెండిరగ్ పనులను ఏ విధంగా పూర్తిచేయాలో కసరత్తు చేస్తామని చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను అతి తక్కువ సమయంలోనే మత్స్యకారులకు కానుకగా అందించేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధంగా ఉన్నారని వివరించారు. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దగదర్తి విమానాశ్రయం, కృష్ణపట్నం పోర్టు వంటి అనేక గొప్ప ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఈ జిల్లాకు మూడు జాతీయ రహదారులు అనుసంధానమై ఉన్నాయని, ఈ ప్రాజెక్టులు పూర్తయితే నెల్లూరు జిల్లాకు అనేక పెట్టు బడులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని, ఈ విషయాలపై ముఖ్యమంత్రి తో చర్చించి రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు మా వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
పెండిరగ్ పనులపై అధికారులతో మంత్రుల సమీక్ష
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పెండిరగ్ పనులపై మంత్రులు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, స్థానిక టీడీపీ నేతలు, తదితరులతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర సమీక్ష నిర్వహించారు. పెండిరగ్ పనులు, పూర్తయిన పనులపై చర్చించా రు. పెండిరగ్ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన వివరాలతో రిపోర్టు తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులకు మెరుగైన బోట్లు అందిం చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, దీనికోసం ప్రభుత్వం నుంచి వారికి ఏమేమి చేయగలమో అవన్నీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్‌ను పూర్తిస్థాయిలో మత్స్యాకారులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించారు. అవసరమైన మార్పులు, చేర్పులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. ఫిషింగ్ హార్బర్‌కు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.
విమానాశ్రయం శంకుస్థాపన స్థలం పరిశీలన
నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద 2019 జనవరి 6న ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జా తీయ విమానాశ్రయం కోసం శంకుస్థాపన చేసిన స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. విమానాశ్రయం పనులు నిలిచిపోవడానికి కారణాలు, పనులు ప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. విమానాశ్రయానికి సంబంధించిన స్థలాలు, వాటికి సంబంధించిన కొన్ని సమస్యలను జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు మంత్రులకు వివరించారు. ఆ సమస్యలను పరిష్కరించేలా అవసరమైన చర్యలు చేపట్టాల ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కలెక్టర్‌ను కోరారు. రానున్న ఐదేళ్లలో నెల్లూరు జిల్లాలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆనం వివరించారు.