అమరావతి (చైతన్యరథం): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైన రోజుని సగౌరవంగా జరుపుకుంటున్నామన్నారు. భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమాహారం కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలు మూలస్తంభాలుగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయంతో కూడుకున్నది. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగానికి పునాది. ప్రతీఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.