మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజావేది క’ కార్యక్రమానికి సంబంధించి 18వ తేదీన సోమవారం నుంచి 23వ తేదీ వరకు అర్జీల స్వీకరణలో మంత్రులు, నాయకులు పాల్గొంటారు. ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారు. అందుకు సంబంధించి షెడ్యూల్‌ను పార్టీ కార్యాలయం ప్రకటించింది. 18న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రభుత్వ సలహాదారు ఎండీ షరీఫ్, ఏపీ బయోడైవర్శిటీ బోర్డ్ చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్, 19న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుజయ్‌కృష్ణ రంగారావు, 20న టీడీపీ పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ నెట్టెం రఘురాం, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, 21న టీడీపీ పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్‌గౌడ్, స్వచ్చాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, 22న టీడీపీ పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ గన్ని వీరంజినేయులు, ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగాడ నాగేశ్వరరావు, 23న టీడీపీ పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీధ ర్, ఏపీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు అర్జీలు స్వీకరిస్తారు.