- వెలుగులు నింపేందుకు చంద్రబాబు కృషి
- తెలుగుదేశంతోనే వారికి రాజ్యాధికారం
- బీసీలను అణగదొక్కింది జగన్‌రెడ్డే
- అక్రమ కేసులు పెట్టించి ఊచకోత కోశారు
- పథకాలు రద్దు చేసి నిధులు దారిమళ్లించారు
- కల్లు గీత కార్మికులను కూడా వేధించారు
- గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి
మంగళగిరి(చైతన్యరథం): బీసీలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0 పథకం ప్రవేశపెట్ట డం జరిగిందని, బీసీల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాల యంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మంత్రి సవితతో పాటు సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదరణ పథకాన్ని పునరుద్ధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కూటమి ప్రభుత్వానికి బీసీ ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. కూటమి పాలనలో బీసీలందరూ సంతోషంగా ఉన్నారు. కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు ఉండే పథకమే ఆదరణ పథకం. ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా చంద్రబాబు ప్రవేశపెట్టారు.
బీసీలకు ఆధునిక పనిముట్లు ఇస్తే వారు నైపుణ్యంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారన్నది ఆయన ఆశయం. వారిని ఆర్థికంగా ముందుకు తీసుకె ళ్లాలనేదే ఆలోచన. రాష్ట్రంలో ఆదరణ 2 పథకం చంద్రబాబే ప్రవేశపెట్టారు. 2014-19 మధ్యన 135 కులాలకు రూ.964 కోట్లతో నాలుగు లక్షల మందికి 90 శాతం సబ్సి డీతో ఆనాడు పథకం తెచ్చారు. కులవృత్తులను బట్టి రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.30 వేలు ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను అందజేశారు. కల్లు గీత కార్మికులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, గొర్రెల కాపరులకు, వడ్డెర, భవన నిర్మాణ కార్మికులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, చేనేత కార్మికులు, టైలరింగ్, పాల వ్యాపారం, ఎలక్ట్రీషియన్స్ ఇలా కొన్ని లక్షల మందికి తోడ్పాటునిచ్చారని గుర్తుచేశారు.
బీసీల నోట్లో మట్టికొట్టిన జగన్‌రెడ్డి
2019 తర్వాత జగన్ సీఎం అయ్యాక పథకాన్ని ఎత్తేశారు. నేను విన్నాను… నేను కన్నాను అని చెప్పే జగన్ బీసీలకు ఏమీ చేయకపోగా ఉన్న పథకాన్ని ఎత్తేశాడని మం డిపడ్డారు. బీసీ కులాలు అభివృద్ధి చెందాలంటే ఆదరణ పథకం ఉండాలి. జగన్ అది లేకుండా చేశాడు. పథకాలన్నీ రద్దు చేశారు. నిధులు కూడా డైవర్షన్ చేసేశారు. దాంతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిరది. జగన్ వచ్చాక రాష్ట్రంలో ప్రజలు అనేక బాధలు పడ్డారు. బీసీ వర్గాలకు చెందిన వారిని అణగార్చారు. ఆదరణ పథకాన్ని రద్దు చేయడమే కాకుం డా బీసీలను ఘోరాతి ఘోరంగా హింసించాడు. వారికున్న 30 పథకాలు నిర్దాక్షిణంగా రద్దు చేశారు. 75 వేల కోట్ల నిధులు దారి మళ్లించాడు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బీసీలకు ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎలాంటి అవకాశాలు లేని సందర్భం లో మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి బీసీలను ఆదుకున్నారు. నూటికి 50 శాతం పైబడి ఉన్న బీసీల బతుకులు మార్చాలనుకున్నాడు. బీసీలు కులవృత్తుల్లోనే మగ్గిపోతున్నారని గ్రహించారు. వారిలో విద్య, రాజకీయం, వ్యాపారం లేదు.. వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో మొట్టమొదటిసారిగా బీసీలకు రాజ్యాధి కారం ఇచ్చారు. స్థానిక సంస్థల్లో ఆయన 20% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాతే బీసీలు సర్పంచులుగా ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు. ఆనాడు అంబేద్కర్ దళితవర్గాలకు రాజ్యాధికారం ఇస్తే బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన దేవుడు ఎన్టీఆర్. ఆ 20 శాతం రిజర్వేషన్‌ను చంద్రబాబు 33% చేసి బీసీల బాంధవుడని అని పించుకున్నారని తెలిపారు.
బీసీలను అవమానించింది నిజం కాదా?
జగన్ హయాంలో బీసీలకు చెందిన 8 వేల ఎకరాల భూములు కబ్జా చేశారు. 70 మందిని ఊచకోత కోశారు. తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య ఇలా ఎంతో మంది బీసీలని పొట్టన పెట్టుకున్నారు. 300 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. ఆస్తులు ధ్వంసం చేశారు. కొంతమంది బీసీలు గ్రామాలు వదిలి వెళ్లి పోయే టట్టు చేశా రు. వేట చేసుకుని వేట మీద ఆధారపడే మత్స్యకారులుకు జీవో నెంబర్ 217 తీసుకొచ్చి వాళ్ల నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా? వాళ్ల వృత్తిని దెబ్బ కొట్టిన మాట వాస్త వం కాదా? ఆనాడు తెలుగుదేశం హయాంలో వివిధ కుల కార్పొరేషన్లకు అన్ని కార్పొరేష న్లకు కూడా నిధులు ఇచ్చి చాలా పెద్దఎత్తున ఆదుకుంటే.. జగన్ 55 కార్పొరేషన్లు పెట్టా ను అని చెప్పి డబ్బా కొట్టుకుని వాళ్లకు నిధులు ఇవ్వలేదు. చైర్మన్‌లను అవమానించడమే కాకుండా బీసీ సమాజాన్ని అవమానించిన మాట వాస్తవం కాదా? ఒక్క రూపాయి నిధు లు ఇచ్చావా? పేరుకు కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వకపోవడం అవమానించినట్టు కాదా?
కల్లు గీత కార్మికులపై కేసులు నిజం కాదా?
ఆనాడు చెట్టుపై నుంచి కల్లుగీత కార్మికులు చనిపోతే పది లక్షలు ఇస్తానని చెప్పా వు. నాడు చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలు ఇస్తే ..జగన్‌రెడ్డి నేను రూ.10 లక్షలు ఇస్తానని చెప్పి పది రూపాయలు ఎవరికైనా ఇచ్చావా? కరోనా సమయంలో వాళ్లు కల్లు గీసుకుంటుంటే కేసులు పెట్టి నానా ఆందోళన బీభత్సం చేసిన మాట వాస్తవం కాదా? నేడు బీసీ కార్పొరేషన్ చంద్రబాబు హయాంలో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా 50% సబ్సిడీ ఇచ్చి 50% రుణం ఇచ్చే పరిస్థితి ఉండేది. లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చే బీసీ కార్పొరేషన్‌ను మొత్తం కూడా నిర్వీర్యం చేసేశారే. ఎక్కడైనా ఒక్క రాష్ట్రంలో మరి మీ హయాంలో వైసీపీ హయాంలో ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చారా? ఒక్క రుణం ఇచ్చా రా? అని ప్రశ్నించారు. ఈ విధంగా బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేయటమే కాకుండా బీసీలకు వచ్చే రాయితీలు కూడా రద్దు చేశారు.
కనీసం సంచార జాతులకు ఏమీ తెలియదు పాపం..బ్యాంకులకు కూడా వెళ్లలేరు. వారికి కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు డైరెక్ట్‌గా రుణాలు ఇస్తుంటే ఆ సంచార జాతుల నోటి దగ్గర కూడు కొట్టిన మాట వాస్త వం కాదా? చిన్న వృత్తులు, చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటే వారి నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా జగన్‌రెడ్డి? మీ దుర్మార్గాలు, దోపిడీలు, దౌర్జన్యాల్లో అత్యధికంగా బలి అయిపోయింది బీసీలేనని మండిపడ్డారు. బీసీల శవాల పునాదుల మీద మీ వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసుకున్నావు. జగన్ సరఫరా చేసిన కల్తీ మద్యం తాగి అత్యధికం గా చనిపోయింది బీసీలే, ఆరోగ్యం పోగొట్టుకుంది బీసీలేనని ధ్వజమెత్తారు.
బీసీల ద్రోహి జగన్..బీసీల బాంధవుడు చంద్రన్న
బీసీల ద్రోహి జగన్ అయితే బీసీల బాంధవుడు చంద్రన్న. బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు. ఇవాళ మళ్లీ చంద్రబాబు అన్నమాట ప్రకారం బడ్జెట్‌లో 39 వేల కోట్లు బీసీలకు కేటాయించారు. అంతేకాదు గతంలో పెండిరగ్‌లో ఉన్న కమ్యూనిటీ హాల్స్, బీసీ భవనాలకు నిధులు ఇచ్చారు. గౌడ కులస్తులకు రాష్ట్రవ్యాప్తంగా 10 శాతం మద్యం దుకాణాల్లో వాటా ఇచ్చి ఈ రోజున గీత కులాలను ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నాలుగు జనరిక్ షాపులు ఇచ్చి దానికి కూడా 50% సబ్సిడీ ఇచ్చి షాపుల నిర్మాణం కూడా చేసి బీసీలను చిన్న చిన్న వ్యాపారాల్లో పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. 80 వేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నాం. గొర్రెలకు, పాడిగేదెలకు, పశువులకు రుణాలు ఇచ్చేందుకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి బీసీలను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.