- చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు
ఉండవల్లి (చైతన్యరథం): పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులతో ఆత్మీయ విందు అనే సరికొత్త సంప్రదాయాన్ని ఆరంభించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్. శుకవ్రారం రాత్రి ఆయన ఉండవల్లిలోని ఉండవల్లి తన నివాసం ఆవరణలో చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు విందు ఇచ్చారు. కుటుంబసభ్యులతో వచ్చిన వారికి లోకేష్ ఎదురేగి మరా స్వాగతం పలికారు. కుటుంబసభ్యులను పరిచయం చేసుకున్నారు. అంతా ఒకేచోట కూర్చుని సరదా సంభాషణలతో గడిపారు. స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా కుటుంబసభ్యుల్లా అంతా కలిసి ఒక పిక్నిక్లా ఆనందంగా గడిపారు.
వివిధ సమస్యలు, ప్రగతి పనులకు సంబంధించి తనకు ఇచ్చిన వినతులు ఏ దశలో ఉన్నాయో ఒక నివేదిక తయారుచేసి ఆయా ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ స్వయంగా అందించారు. మహిళలకు మంగళగిరి పట్టుచీరలను కానుకగా అందించారు. ఆత్మీయవిందు పూర్తయ్యాక లోకేష్ అతిథులందరినీ గేటు వరకూ వెళ్లి సాగనంపారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్ (నగరి), వీఎం థామస్ (జిడి నెల్లూరు), గురజాల జగన్మోహన్ (చిత్తూరు), కె మురళీమోహన్ (పూతలపట్టు), పులివర్తి వెంకట మణిప్రసాద్ (చంద్రగిరి), ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ (కుప్పం)… అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు చింతకాయల అయ్యన్నపాత్రుడు (స్పీకర్` నర్సీపట్నం), హోం మంత్రి వంగలపూడి అనిత (పాయకరావుపేట) బండారు సత్యనారాయణమూర్తి (మాడుగుల), కేఎసఎనఎస్ రాజు (చోడవరం), కొణతాల రామకష్ణ (అనకాపల్లి-జనసేన), పంచకర్ల రమేష్‌బాబు (పెందుర్తి-జనసేన), సుందరపు విజయ్‌కుమార్ (ఎలమంచిలి-జనసేన) కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు.












