అమరావతి (చైతన్యరథం): మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న కోనేరు హంపికి సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మీ అసాధారణ నైపుణ్యం, ఏకాగ్రత, సంకల్పంతో ఈ ఘన విజయం సాధించారని కొనియాడారు. మీ కృషి, ప్రతిభకు ఈ విజయమే నిదర్శనం. యువతకు స్ఫూర్తినిచ్చేలా చెస్‌లో విజయాల పరంపర కొనసాగాలని ఆకాంక్షించారు.