- వేదిక నుంచి మంత్రిని దింపేసిన వైనం..
- ఆ కుర్చీల్లో సొంత సామాజకవర్గ నేతలు
- సభ ఆసాంతం నిలువుకాళ్ల దండన
- అవమానభారంతో ఆదిమూలపు
- వైసీపీ అభ్యర్థి తాటిపర్తికీ అవమానం
- భగ్గుమంటున్న దళిత సంఘాలు
- జగన్ క్షమాపణకు మాణిక్యరావు డిమాండ్
- మంత్రి రాజీనామా చేయాలని సూచన
ప్రకాశం, అమరావతి(చైతన్యరథం): వైసీపీ సర్కారు సభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్`దళిత మంత్రిని, దళిత వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థినీ తీవ్రఅవమానానికి గురి చేసిన సంఘటన సంచలనమవుతుంది. బుధవారం వెలుగొండ ప్రాజెక్టు వద్ద సీఎం జగన్ సభ నిర్వహిం చారు.సభా వేదికపైనున్న మంత్రి ఆదిమూలపు సురేష్, ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ను సాక్షాత్తూ జగన్ కిందకు పంపించారు. సీట్లలో కూర్చు న్న వారిని లేపిమరీ కిందకు పంపించి.. సభ పూర్తయ్యే వరకూ వేదిక కింద నిలబెట్టిన తీరుపై దుమారం లేస్తోంది. పైగా వారి సీట్లలో తన సామాజికవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ వెంకాయమ్మని కూర్చోబెట్టుకున్నారు. దీంతో జగన్ ప్రసంగం సాగినంత సేపు మంత్రి సురేష్, చంద్ర శేఖర్ నిలబడే ఉన్నారు. కార్యక్రమం జరుగుతున్నది మంత్రి ఆదిమూలపు సురేష్ సొంత నియోజకవర్గంలో అయినప్పటికీ సభా వేదికపై ఆయనకు చోటు లభించ కపోవడం గమనార్హం. దీంతో సీఎం జగన్ తీరుపై దళితవర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఓటేయడానికి మాత్రమే జగన్‌కు ఎస్సీలు పనికొస్తారు. ఈ పెత్తందారు పక్కన కూర్చుంటే మాత్రం కుదరదు. ఇదేమీ తొలిసారి కాదు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి సహా ఆ సామాజికవర్గ నేతలంతా కూర్చుని, దళితుడ్కెన డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామిని నిలబెట్టి అవమానించడం నుండి, అమలాపురంలో దళితమంత్రి విశ్వరూప్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టటం వరకు ఇలాంటివి ఎన్నో. ఇక దారుణాల విషయాలకు వస్తే వైజాగ్ డాక్టర్ సుధాకర్ నుండి డ్క్రెవర్ సుబ్ర మణ్యం నుండి అటు చిత్తూరులో దళిత జడ్జీ వరకు, శిరోముండనాల నుండి సగం గెడ్డంతో పంపేయడం వరకు రాతియుగంలోకే పయనం. కుల అహంకారి జగన్ రెడ్డి లాంటి వారి రూపంలో, మళ్లీమళ్లీ జడలు విప్పుతూనే వుంటుంది కుల వివక్ష.
దళితజాతికే అవమానం..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారం భోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌ను అవమానించడం ద్వారా జగన్‌రెడ్డి దళితజాతినే అవమానించాడని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఓట్లతో ముఖ్యమంత్రినయ్యానన్న కనీస విజ్ఞత జగన్‌కు లేకపోవడం దారుణమన్నారు. మంగళ గిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తన సామాజిక వర్గీయులైన వైవీ సుబ్బారెడ్డికి, బూచేపల్లి వెంకాయమ్మకు కుర్చీలు ఇచ్చేందుకు సురేష్‌తోపాటు, యర్రగొండపాలెం వైసీపీ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ని కూడా సభావేదికపై నుండి జగన్ వెళ్లగొట్టడం దళితజాతి మొత్తానికి జరిగిన అవమానమన్నారు. సభ పూర్తయ్యే వరకూ సురేష్‌ను నిలువు కాళ్లపై నిలబెట్టడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. దళితుల్ని చంద్రబాబు అమితంగా గౌరవిస్తున్నా జగన్‌రెడ్డి తన సాక్షి మీడియాలో లేనిపోని విషప్రచారం చేసి, దళితుల్ని టీడీపీకి దూరంచేయడానికి ప్రయత్నించాడని దుయ్యబట్టారు. కానీ నేడు మంత్రి ఆదిమూలపు సురేష్‌పట్ల వ్యవహరించిన తీరుకి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడని మాణిక్యరావు ప్రశ్నించారు.
అణువణువునా అహంకారమే..
జగన్‌రెడ్డి తక్షణమే తప్పు ఒప్పుకొని ఆదిమూలపు సురేశ్‌కు క్షమాపణ చెప్పాలని, లేదంటే మంత్రయినా తనకు జరిగిన అవమానంపై నిరసన తెలిపి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌రెడ్డి హయాంలో దళితులపై జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలు దాదాపు 500కు పైగా ఉన్నాయి. వీటిపై ముఖ్యమంత్రి ఏనాడూ స్పందించిన పాపాన పోలేదు. అణువణువునా ఆయనలో నిండిఉన్న అహంకారం, దళితజాతిపై ఆయనకున్న ద్వేషమే అందుకు కారణ మని మాణిక్యరావు వ్యాఖ్యానించారు. దళితులపై జరి గిన దారుణాలపై దళితమంత్రులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించినందుకు నేడు వారే జగన్‌రెడ్డి చేతిలో అవమానాలకు గురవుతున్నారు. డాక్టర్ సుధాకర్ ఉదంతం నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని ప్రజల సాక్షిగా అవమానించడం, మంత్రి విశ్వరూప్‌ను మోకాళ్లపై నిలబెట్టిన ఘటనలపై సాటి దళిత మంత్రులు నాగార్జున, సురేష్‌లాంటి వారు గతంలోనే స్పందించి ఉంటే, నేడు జగన్‌రెడ్డి అహంకార పోకడ వారిదాకా వచ్చేదికాదన్నారు. డాక్టర్ అనితారాణి, డాక్టర్ అచ్చెన్నలపై దాడులు జరిగినప్పుడు వైసీపీలోని దళితనాయకులు ఎక్కడికిపోయారు? కాకులకు ఉన్నపాటి ఐక్యత కూడా దళితమంత్రుల్లో లేకపోవడం విచారకరం. సురేష్‌కు జరిగిన అవమానంపై ప్రతిపక్ష నాయకుడినైనా నాకే కోపంగా ఉంది. అలాంటిది సురేష్ ఏమాత్రం చలనం లేకుండా బొమ్మలా ఊరుకోవడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ చొక్కాలు విప్పి రోడ్లపైకి వచ్చి గంతులేసిన సురేష్, నేడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎందుకు నిరసన వ్యక్తం చేయడు? తన నియోజకవర్గంలో జరిగిన సభలో తనకు ఎందుకు చోటివ్వలేదని జగన్‌రెడ్డిని నిలదీస్తే, సురేష్‌కు మేం కూడా మద్దతు ప్రకటిస్తామని మాణిక్యరావు వెల్లడిరచారు.
అంబేద్కర్‌ను గౌరవించరు సరే..
దళితులు, దళిత మేధావులు, ఆఖరికి అంబేద్కర్ వంటి మహనీయులంటే జగన్ రెడ్డికి ఎలాగూ గౌరవమర్యాదలు లేవు. కనీసం తనకింద పాలేరుల్లా పని చేస్తున్న దళితమంత్రుల్ని కూడా గౌరవించకపోతే ఎలా? జగన్ రెడ్డి ఇదేవిధంగా వ్యవహరిస్తే దళితజాతి ఏం చేయాలో అదిచేస్తుంది. జగన్ రెడ్డి..అతని నేరముఠాను తరిమికొట్టడానికి ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, నాగార్జునలకు సిగ్గుంటే తక్షణమే జగన్ రెడ్డి క్షమాపణ చెప్పేలా ఒత్తిడి తేవాలి. లేకుంటే తమ పదవులకు రాజీనామా చేసి, తమకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉన్నాయని, తాము నిజమైన దళితులని నిరూపించుకోవాలని మాణిక్యరావు హితవు పలికారు.