- 2 వేల మంది క్రీడాకారులతో నిర్వహించాం
- 24,142 మందిని పోటీల్లో భాగస్వామ్యం చేశాం
- రూ.33 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశాం
- వచ్చే ఏడాది 3 లక్షల మందిని భాగస్వామ్యం చేస్తాం
- గత ప్రభుత్వ బకాయిలు రూ.16కోట్లు విడుదల చేశాం
- ఇకనుంచి ఒక క్రీడకు ఒక సంఘం మాత్రమే ఉండాలి
- ఉద్యోగాలకు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిన వారిపై కేసులు
- శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు
విజయవాడ(చైతన్యరథం) కూటమి ప్రభుత్వం క్రీడాకారులను గౌరవిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్టణంలోని ఏయూ కన్వెన్షన్ హాలులో 2 వేల మంది క్రీడాకారులతో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించామని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. క్రీడా దినోత్సవాన్ని అత్యంత విజయ వంతంచేసిన క్రీడాకారులు, శాప్ అధికార యంత్రా గం,సిబ్బంది,కోచ్లు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. విజయవాడ బజీఎంసీ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ గతానికి భిన్నంగా ఈ ఏడాది నేషనల్ స్పోర్ట్స్ డేను విశాఖలో ఘనంగా నిర్వహిం చామన్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా జాతీయ, అంత ర్జాతీయ క్రీడా ప్రముఖులు వచ్చారు. గతంలో స్పోర్ట్స్ డే అంటే డీఎన్ఏ ల్లో ర్యాలీ చేసి తూతూమంత్రంగా నిర్వహించేవారు. కానీ నేషనల్ స్పోర్ట్స్ డేలో భాగంగా శాప్ తొలిసారిగా అమరావతి ఛాంపియన్ షిప్ పేరుతో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించిందన్నారు. ఈ పోటీల్లో 24,121 మంది క్రీడాకారులను భాగస్వామ్యం చేశామని, వచ్చే ఏడాది నేషనల్ స్పోర్ట్స్ డేలో 3 లక్షల మందిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయిం చామన్నారు. గత వైసీపీ ప్రభు త్వం క్రీడాకారులకు బకాయిలు పెట్టిన రూ.16 కోట్లను క్రీడా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం విడుదల చేసింద న్నారు. అలాగే స్పోర్ట్స్ డే పురస్కరించుకుని శాప్ అధ్వర్యంలో నిర్వ హించిన అమరావతి ఛాంపియన్ షిప్ విజేతలకు రూ.33 లక్షలు నగదు ప్రోత్సాహకాలు అందజేసినట్లు వివరించారు.
క్రీడాకారులకు అన్యాయం జరగనివ్వం
రాష్ట్రంలో అసలైన క్రీడాకారులకు అన్యాయం జరగనివ్వం. క్రీడాకోటా కింద కేటాయిస్తున్న నియామకాలను ప్రభుత్వం నిష్పక్ష పాతంగా, పారదర్శకంగా చేపడుతుంది. మెగా డీఎస్సీకి సంబం ధించి 421 పోస్టులు స్పోర్ట్స్్కు కేటాయించాం.. దరఖాస్తు చేసుకు న్న వారిలో 870కి పైగా ఫేక్ సర్టిఫికెట్లు వచ్చాయి. వాటిపై చర్య లు తీసుకుంటాం. ప్రభుత్వ నియామకాల కోసం ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిన క్రీడాకారులు, ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసిన అసోసియేషన్లపై కేసులు తప్పవని హెచ్చరించారు. శాప్ గుర్తింపు లేని అసోసియే షన్ల తరపున ఆడిన క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని, క్రీడా సంఘాలు కూడా శావ్ నిబంధనలకు అనుగుణంగా పనిచే యాలని సూచించారు. క్రీడాసంఘాలు క్రీడాకారులను ఇబ్బందు లు పెట్టొద్దని, ప్రతి ఆరునెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహి స్తామన్నారు. రెండు, మూడు క్రీడా సంఘాలు ఉంటే కుదర దన్నారు. ఒక క్రీడకు ఒక సంఘం మాత్రమే ఉండాలని, లేకుంటే శాప్ జోక్యం చేసుకుంటుందని, గత పాలకుల మాదిరిగా శాప్ ఉండదన్నారు. క్రీడా సంఘాలు క్రీడల నిర్వహణను ధనార్జనగా భావిస్తే కుదరదన్నారు. ఆడుదాం ఆంధ్రా స్కామ్పై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక వెళ్లిందని, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసు కుంటుందో వేచి చూస్తున్నామన్నారు.
ఎన్ఆర్ఐలు ముందుకురావాలి
ఏపీలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఎన్ఆరలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన జాతీయస్థాయి వెయిట్ లిఫ్టర్ ఎస్.వేణుగోపాల్ను ప్రోత్సహిస్తూ అమెరికాలోని టాంపా సిటీకి చెందిన ఎన్ఆర్ఐ యడ్లపల్లి రాకేష్ పీ-4 విధానం ద్వారా రెండేళ్ల పాటు దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా క్రీడా కారుడిని దత్తత తీసుకున్న ఎస్ఆర్గను శాప్ చైర్మన్ అభినం దించారు. రాకేషు స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన ఎన్ఆర్ఎలు కూడా క్రీడలను, క్రీడాకారులను దత్తత తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ ఎస్.సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.