పాల్గొన్న ఇండియన్ కలినరీ ప్రతినిధులు
అమరావతి(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌ను కలినరీ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పర్యాటక శాఖ తిరుపతిలోని ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్‌తో అవగాహనా ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ కీలక మైన ఎంఓయూ కుదిరింది. ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు- ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌లు సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకు న్నారు. తెలుగు రుచులను, వంటకాలను ప్రపంచానికి పరిచ యం చేయటంతో పాటు ప్రాంతీయ ఆహార సంస్కృతిని చాటి చెప్పేలా ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ సహకారం అందించ నుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ను కలిన రీ టూరిజానికి ఓ కీలకమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలు గా ఈ ఎంఓయూ తోడ్పడనుంది.
ప్రత్యేకించి కలినరీ విభాగం లో నైపుణ్యాభివృద్ధి కల్పన, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఏపీ టూరిజం అథారిటీ నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్స్, టూరిజం ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెలుగు వంటకాల రుచులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలియ చేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ అవగాహనా ఒప్పందం కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు

















