- మంచి పనులకు దాతల సాకారం
- త్వరలోనే పాఠశాలల్లో రక్షిత తాగునీటి ప్లాంట్లు
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి(చైతన్యరథం): నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల ల్లో చదువుకుంటున్న 8 వేలకు పైగా విద్యార్థులకు ఉచితంగా అందజేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరం ఉన్నత పాఠశాలలో మంత్రి పర్యటించి 44 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. పిల్లల చదువులు తల్లిదం డ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే కొందరు పేద విద్యార్థులకు కూడా సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు 8 వేలకు పైగా సైకిళ్లను దాతల సహకారంతో ఉచితంగానే విద్యార్థులకు అందిం చగలిగామన్నారు. ఇందులో ఒక వెయ్యి సైకిళ్లను తమ కంపెనీ తరపున విద్యార్థులకు అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వడం చూసిన ఒక దాత పాఠశాలల్లో రక్షిత తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తనకు రూ.12 లక్షలు ఇచ్చారని వెల్లడించారు. ఈ డబ్బుతో 8 పాఠశాలల్లో త్వరలోనే రక్షిత తాగునీటి ప్లాంట్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. గతంలో అంబేద్కర్ జయంతిలో పాల్గొనే సమయంలో ఒక తండ్రి వేసిన ప్రశ్న ఆలోచింపచేసింది. ఇంట్లో ఒక్కరి చదువుకే అప్పటి వైసీపీ ప్రభుత్వం డబ్బులేసింది..ఇంకో పిల్లాడిని కూలికి పంపాలా అంటూ ఆ తండ్రి వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని తాను చంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లడంతో తల్లికి వందనం అమలు చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. లోకేష్ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత పాఠశాల విద్యపై ప్రత్యే క దృష్టి కేంద్రీకరించారు. రాజకీయాలు ఉండకూడదు, విద్యాల యాలు బాగుపడాలని ఎటువంటి గుర్తులు లేకుండా బ్యాగులు, యూనిఫాం, పుస్తకాలను విద్యా సంవత్సరంలో సకాలానికే పిల్లల కు అందిస్తున్నారని వివరించారు.













