- తప్పుడు డాక్యుమెంట్లు, ఆన్‌లైన్‌లో పేర్ల మార్పులు
- ప్రజావినతుల కార్యక్రమానికి వచ్చిన బాధితులు
- న్యాయం చేయాలని మంత్రి ఆనంకు వినతి
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గత ప్రభుత్వం లో వైసీపీ నేతల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిం చి భూ కబ్జాలు చేయటమే కాకుండా, ఆన్‌లైన్‌లో ఒకరి పేరుపై ఉన్న పొలాలను వైసీపీ నేతలు తమ పేరుపైకి మార్చుకున్న వైనంపై బాధితులు క్యూకట్టారు. మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, కురబ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప అర్జీలు స్వీకరిం చారు.
` టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఒగ్గు గవాస్కర్ అండతో గానుగపెంట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి తమ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా తనపైనే తప్పుడు కేసులు పెట్టారని విజయవాడకు చెందిన రిటైర్డ్ టీచర్ పి.అరవింద ఫిర్యాదు చేశాడు. విచారించి అక్రమ కేసుల నుంచి తనను తొలగించి కబ్జా తన స్థలాన్ని విడిపించి న్యాయం చేయాలని కోరారు.
` మైదుకూరుకు చెందిన వైసీపీ నాయకుడు ఉపేంద్ర పట్టాభి సీతారామరాజు తమ భూమిని అక్రమంగా ఆన్‌లైన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని కడప జిల్లా కాశీనా యన మండలం కె.ఎన్.కొట్టాల గ్రామానికి చెందిన ఒరుసు కృష్ణకుమార్ ఫిర్యాదు చేశా డు. విచారణ జరిపించి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు.
` సున్నిపెంటకు చెందిన వైసీపీ నేత సయ్యద్ నూర్‌బాషా గత ప్రభుత్వంలో తమకు శ్రీశైలం దేవస్థానంలో షాపులను ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశాడని నంద్యాల జిల్లా శ్రీశైలానికి చెందిన సగ్గిల రామయ్య ఫిర్యాదు చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని తమకు డబ్బులు ఇప్పించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
` తన అత్త తనకు రాసి ఇచ్చిన భూమిని గత ప్రభుత్వంలో తనకు తెలియకుండా జగనన్న కాలనీ పేరుతో తీసుకుని అధికారులు, కబ్జాదారులు కుమ్మక్కై ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు కొట్టేశారని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన కొల్లి ఆనంద్‌బాబు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన పరిహారం ఇప్పించాలని విన్నవించారు.
` కర్నాటక బోర్డర్‌లో ఉన్న తమ గ్రామం అభివృద్ధికి దూరంగా ఉందని.. గ్రామం లో మౌలికవసతులైన రోడ్లు, డ్రైన్లు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని కర్నూలు జిల్లా హోళగుంద మండలం ఎండీహళ్లి గ్రామ సర్పంచ్ జి.సుధాకర్ విన్నవించారు. తమ గ్రామానికి నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని వినతిపత్రం అందజేశారు.
` రంగయ్య అనే కానిస్టేబుల్ దొంగ డాక్యుమెంట్లతో స్థలాన్ని అమ్మి డబ్బులు కొట్టేశాడని నంద్యాల జిల్లా గడివేముల మండలానికి చెందిన పి.రామకృష్ణారావు ఫిర్యాదు చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని తిరిగి డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరారు.
` తమ గ్రామంలో 2014-2019 మధ్య అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్లు నిర్మించగా బిల్లులు ఇంకా 30 శాతం ఇంకా పెండిరగ్ ఉన్నాయని తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం ముదిమూరు గ్రామానికి చెందిన బి.మునిశేఖర్‌రెడ్డి విన్నవించా రు. ఆ బిల్లులను ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.
` రెవెన్యూ శాఖలో ఆర్‌ఐగా పనిచేస్తున్న తన భార్య తనకు దూరంగా ఉంటూ పిల్లలను చిత్రహింసలు పెడుతుందని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన రామవతు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చెంపలు, ఒంటిపై వాతలు పెట్టి హింసించిం దని..కన్న తల్లి, ప్రభుత్వ అధికారి అన్న విచక్షణ మరచి పిల్లాడిని హింసించిన తన భార్యపై చర్యలు తీసుకోవాలని కోరారు.
` తమ తాతల నుంచి సాగుచేసుకుంటూ 2021 వరకు ఆన్‌లైన్‌లో ఉన్న తమ భూమిని 2022లో తమ పేరు మార్చి వైసీపీ నాయకుడు లక్ష్మీనారాయణ గుప్తా పేరు ఎక్కించారని కర్నూలు జిల్లా పత్తికొండ మండలానికి చెందిన మేదర మేరి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు.