- ఆన్‌లైన్‌లో పేర్లు మార్చి తమను బెదిరిస్తున్నాడు
- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితురాలి ఫిర్యాదు
- అక్రమ మైనింగ్, దొంగ బిల్లులపైనా వినతిపత్రాలు
- అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్సీ దువ్వారపు, సోమిశెట్టి
మంగళగిరి(చైతన్యరథం): తమకు వారసత్వంగా సంక్రమించిన భూమిని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కార్ డ్రైవర్ అక్రమంగా కొట్టేసేందుకు ఆన్‌లైన్‌లో పేర్లు మార్చి తమను బెదిరిస్తున్నాడని విజయగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన మల్లా ప్రగడా సరస్వతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజా వినతుల కార్యక్ర మంలో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించి అతనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేసింది. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అర్జీలు స్వీకరించారు.
` తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని వీఆర్వో కె.వి.ఆదినారాయణ లంచం తీసుకుని అక్రమంగా మరొకరికి దొంగ పాస్ పుస్తుకాలు ఇచ్చాడని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలానికి చెందిన సకినాల కృష్ణ ఫిర్యాదు చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని తన భూమి తనకు దక్కేలా చూడాలని కోరారు.
` ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో ఉన్న కృష్ణసాయి గ్రానైట్స్ పేరుతో జరుగు తున్న అనధికార మైనింగ్ దోపిడీపై విచారణ జరిపించాలని ముప్పూరి రంగారావు ఫిర్యా దు చేశాడు. వారు దోచుకున్న రూ.1690 కోట్లను ప్రభుత్వం రికవరీ చేయాలని వినతి పత్రంలో కోరారు.
` తమ స్థలంలో ఉన్న షాపులను అక్రమంగా మున్సిపల్ అధికారులు కూల్చారని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఎస్.ఎస్.మోమీన్ ఫిర్యాదు చేశాడు. మున్సిపల్ కమిషనర్ వైసీపీ నేతలతో అంటకాగుతూ తాము చెప్పేది వినకుండా ఇబ్బంది పెడుతు న్నారని తెలిపారు. కూల్చవద్దని కోర్డు ఆర్డర్ ఉన్నా పట్టించుకోవడం లేదని ఆమెపై చర్య లు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
` తాము కుమ్మరి కులవృత్తిని చేసుకునేందుకు ప్రభుత్వం గతంలో స్థలం కేటాయిం చగా దాన్ని కొంతమంది కబ్జా చేశారని బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన కుమ్మరి సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన స్థలాన్ని ఆక్రమణ నుంచి విడిపించి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
` అన్నమయ్య జిల్లా కలిగిరి మార్కెట్‌లో సూపర్‌వైజర్ ఎస్.మస్తాన్ దొంగ బిల్లులు సృష్టించి విత్ డ్రా చేసుకుంటున్నాడని బండి ఈశ్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆయన పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరాడు.
` వడ్డీ వ్యాపారి షేక్ హబీబ్ దొంగ పత్రాలు సృష్టించి విభిన్న ప్రతిభావం తురాలి నైన తన ఇంటిని కబ్జా చేశారని అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్ షహీరా ఆవేదన వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
` ఎస్సీలమైన తాము టీడీపీకి అనుకూలంగా ఉండటంతో వైసీపీకి చెందిన నాగేం ద్రరెడ్డి, కాటమరెడ్డి, సంజీవరెడ్డిలు తమ పొలానికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. పూర్వం నుంచి ఉన్న దారిలో వెళుతుంటే బెదిరిస్తూ తిడు తున్నారని వారిపై చర్యలు తీసుకుని రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.