అమరావతి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడు అని కొనియడారు. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్నారని గుర్తుచేశారు. తన ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఎర్రన్నాయుడితో ఉన్న ఫొటోను చంద్రబాబు షేర్ చేశారు.