- ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది
- మరో 48 గంటలు కీలకం…సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం
- విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం
- దాడులు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు
- నిందితుడిపై న్యాయబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటాం
- బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
- బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న
- బాలికను పరామర్శించిన మంత్రి నారా లోకేష్
బెంగళూరు(చైతన్యరథం): అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను సొంత కూతురిలా భావించి అండగా ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు ఓల్డ్ హాల్ ఎయిర్పోర్ట్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రికి వచ్చిన లోకేష్.. అమానుష దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించా రు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. రాప్తాడులో ఉన్మాది ఘట నలో గాయపడిన బాలికకు అనంతపురంలో చికిత్స చేసిన అనం తరం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించేలా చూశాం. ఇక్కడి వైద్యులు సుమారు 12 గంటల పాటు శ్రమించి బాలికకు అనేక శస్త్రచికిత్సలు చేశారు. అనంతరం ఐసీయూకి తరలించారని తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. వచ్చే 48 గంటలు చాలా కీలకం. రాష్ట్ర ప్రజలందరూ బాలిక ఆరోగ్యం గురించి ప్రార్థించాలి. బాలిక చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకుం టుంది. అన్నివిధాలా అండగా నిలబడుతుంది. జరిగిన ఘటనతో పాఠశాలలో విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అందిస్తున్నాం. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. వచ్చే ఏడాది పాటు మానిటరింగ్ చేస్తామని చెప్పారు.
కార్మికుడి ముసుగులో వచ్చి ఘాతుకం
పాఠశాలలో మొదటి పీరియడ్ ప్రారంభమైన వెంటనే గేట్లు మూసివేస్తాం. సదరు పాఠశాలలో భవిత సెంటర్ నిర్మాణం జరు గుతుండటంతో కార్మికుడి ముసుగులో వచ్చి సదరు యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. దాడి ఘటనను చాలా సీరియస్‌గా తీసు కుంటున్నాం. మరోసారి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతాం. విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యత. పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. దాడికి పాల్పడిన వ్యక్తిపై న్యాయబ ద్ధంగా, కఠినమైన చర్యలు ఏపీ ప్రభుత్వం తీసుకుంటుంది. మహిళలపై దాడులకు పాల్పడే వారికి అదే చివరిరోజు అవు తుందని గతంలోనే హెచ్చరించడం జరిగింది. అలాంటి కఠినమైన, న్యాయబద్ధమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
బాలిక సురక్షితంగా ఇంటికి రావాలని ప్రార్థిద్దాం
బాలిక కుటుంబసభ్యులను కూడా కలిశాను. ప్రభుత్వం అండ గా ఉంటుందని హామీ ఇచ్చాను. ఏ అవసరం వచ్చినా సంప్రదిం చాలని చెప్పాను. ప్రభుత్వ పరంగానే కాకుండా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను, స్థానిక శాసనసభ్యురాలిగా పరిటాల సునీత అండగా ఉంటామని ధైర్యం చెప్పాను. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వచ్చే 48 గంటలు మేం నిరంతరం పర్యవేక్షిస్తాం. ఇక్కడి వైద్యులు అద్భుతంగా స్పందించారు. వైద్యులతో పాటు పోలీసులను కూడా అభినందిస్తున్నాను. గ్రీన్ ఛానల్ ఇవ్వాలని కోరిన వెంటనే తక్షణ మే స్పందించి తగిన ఏర్పాట్లు చేశారు. బాలికను సురక్షితంగా తరలించారు. ఇలాంటి ట్రామా కేసును ఇక్కడి వైద్యులు ఎప్పుడూ చూడలేదు. 12 గంటల పాటు నిరంతరం శ్రమించారు. వచ్చే 48 గంటలు చాలా కీలకం. బాలిక సురక్షితంగా ఇంటికి రావాలని అందరం ప్రార్థిద్దామని పిలుపునిచ్చారు.
విజయవంతంగా శస్త్రచికిత్సలు
అంతకుముందు బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి వచ్చిన లోకేష్.. బాలికకు అందుతున్న చికిత్సపై ఆసుపత్రి వైద్యులతో సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థినికి అవసరమైన శస్త్రచికిత్సలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేశామని, బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థితికి వచ్చే 48 గంటలు చాలా కీలకమని వివరించారు. బాలిక ప్రాణాలు కాపాడేందుకు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు చేస్తున్న కృషికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆసు పత్రిలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు వెళ్లి బాలికను చూశారు. బాలిక తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.
















