అమరావతి(చైతన్యరథం): మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ప్రమాదం ఉందనే సూచనలను దృష్టిలో పెట్టుకుని పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయ్, డీకే శివకుమార్‌లతో ఆదివారం సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. తుఫాను నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణ పనులకు అవసరమైన సిబ్బంది ని, యంత్రాలను పంపాలని రెండు రాష్ట్రాల సీఎంలను కోరారు. దీనిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పం దించారు. ఏపీకి అవసరమైన మేరకు సహకరిస్తామని తెలిపా రు. ఈ మేరకు ఏపీ అధికారులు ఇరు రాష్ట్రాలకు చెందిన శాఖాధికారులను సంప్రదిస్తారని సీఎం చంద్రబాబు వారితో చెప్పారు. అర్నబ్ తుఫాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించే పనుల నిమిత్తం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన సిబ్బంది క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నారు. మరో వైపు అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనుల ను ముగించుకున్న పలువురు విద్యుత్ శాఖ సిబ్బందిని ముందు జాగ్రత్తగా మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది.
















