- మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో గెలిచి తీరాలి
- 2024 మించి ఓట్ల శాతం పెరగాలి
- గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి
- మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ రీ ఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు కల్పించాం. క్షేత్రస్థాయిలో కూటమి నేతలు మిత్ర ధర్మం పాటిస్తూ అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. పార్టీ నుంచి పోటీ చేసే 11 మేయర్ స్థానాలకు 11 సామాజిక వర్గాలకు కేటాయిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల్లో 2024 ఎన్నికల ఫలితాలకు మించిన స్థాయిలో ఓట్ల శాతం పెరగాలని స్పష్టం చేశారు. గెలుస్తామన్న ధీమాతో వ్యవహరించకుండా అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ఫలితాలు సాధించాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలని స్పష్టం చేశారు. సోషల్ రీ ఇంజనీరింగ్ ద్వారా సీట్ల కేటాయింపు జరిగింది. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాం.
ప్రజాభిప్రా యం, క్యాడర్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే అభ్యర్థుల ఎంపిక చేపట్టాం. ప్రజాభిప్రాయ సేకరణలో 50శాతం కంటే ఎక్కువగా ఉన్న వారినే అభ్యర్థులుగా ఎంపిక చేశామని వివరించారు. కొంతమంది అభ్యర్థిత్వాలపై 80 శాతానికి మించిన మద్దతు లభించింది. కూటమి పార్టీల మనోభావాలను గౌరవించాలి.. మిత్ర ధర్మం పాటించాలి. ఐక్యంగా ముందుకువెళ్లాలని సూచించారు. ఒకటి, రెండు చోట్ల వచ్చిన సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోంది. గొడ్డలి పార్టీ చర్యలను గమనిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి.. ఆ పార్టీ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు.















