చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పేదల ఆర్థిక సాధికారతే లక్ష్యం

మొగల్తూరు ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

by చైతన్యరధం
Sep 2, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
పేదల ఆర్థిక సాధికారతే లక్ష్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు
  • నదుల అనుసంధానంతో నీటి సమస్యకు పరిష్కారం
  • గత పాలకులు బటన్ నొక్కారు.. రోడ్లకు గుంతలు పెట్టారు
  • ఓటమి భయంతోనే గొడ్డలి పార్టీ ఏకగ్రీవాలు వద్దంటోంది
  • మొగల్తూరు ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

నర్సాపురం (చైతన్యరథం): పేదల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు సమ ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ పరిధిలోని మొగల్తూరులో మంగళవారం నిర్వహించిన పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 31 ఏళ్ల క్రితం సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో పాటు ప్రజా చైతన్యం, ప్రజా భాగస్వామ్యం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాలకు పెంచిన పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.73,507 కోట్లను పెన్షన్ల రూపంలో పేదలకు అందించామని చెప్పారు. రెండేళ్లలో సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

మహిళా సాధికారతకు పెద్దపీట
డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టి మహిళా సాధికారతకు బాటలు వేశామని చంద్రబాబు అన్నారు. ఏ ఆడబిడ్డా వంట కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో దీపం పథకాన్ని తీసుకొచ్చామని, ఇప్పుడు దీపం – 2.0 ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో 33శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. గత ఏడాది లక్ష మంది డ్వాక్రా మహిళలు ఎంఎస్ఎంఈలుగా ఎదిగారని, ఈసారి లక్ష్యాన్ని మరింత పెంచామని తెలిపారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ‘స్వయం’ బ్రాండ్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల్లో ఇంకా ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ఉందని సీఎం పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వడ్డెర్లకు మైనింగ్, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ. 20వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణను అమలు చేసి న్యాయం చేశామని చెప్పారు. గిరిజన ప్రాంతాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షలు, ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యా అవకాశాలకు పంపిస్తున్నామని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

బటన్ నొక్కడం కాదు.. ఇంటింటికీ వచ్చి పెన్షన్
బటన్ నొక్కడం కాదు.. ఇంటింటికీ వచ్చి పెన్షన్ ఇస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ‘స్త్రీశక్తి’ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఆర్థికంగా వెసులుబాటు కలిగించామని చెప్పారు. గ్రామంలో ఇంకా పేదలు ఉన్నారంటే ఆ గ్రామానికే అవమానమని వ్యాఖ్యానించారు. ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పీ4 ద్వారా జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరవు నేలకు కృష్ణా జలాలు అందించామని, శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవస్వామి పాదాల వరకు నీరు పారించామని చెప్పారు. నల్లమల కొండల్లో సొరంగాలు తవ్వి నీటిని తరలించడం తన జీవితంలో ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందన్నారు. బుధవారం గోదావరి నీటిని పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు తరలించబోతున్నామని తెలిపారు. గోదావరి జలాలు తొలుత అనకాపల్లికి, వచ్చే ఏడాది విశాఖకు, ఆ తర్వాత వంశధార ప్రాంతానికి చేరేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నదుల అనుసంధానంతో దేశంలోని నీటి సమస్యలను పరిష్కరించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

పెట్టుబడులకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మారుస్తాం
గత పాలకులు పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారని సీఎం విమర్శించారు. దీనివల్ల యువత భవిష్యత్తు దెబ్బతిందన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యుత్ సంస్థలను సమర్థంగా నిర్వహిస్తూ తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించామని తెలిపారు. ఆక్వా రైతుకు అండగా నిలిచేందుకు విద్యుత్ యూనిట్ ను రూ.1.50కే అందిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ మార్కెట్లలో ఇతర దేశాలతో పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తులను తీర్చిదిద్దాలన్నారు. ప్రజా పాలనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఏఐ ట్యూటర్, ఏఐ డాక్టర్ వంటి వ్యవస్థలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలకు ఆన్లైన్లో ప్రభుత్వ సేవలు అందించేలా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటిపై సౌర విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుపైనా దృష్టి పెట్టామని తెలిపారు. నర్సాపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆక్వా కల్చర్ యూనివర్సిటీ, డంప్ యార్డు, డెల్టా మోడర్నైజేషన్ వంటి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

ఎన్డీఏ కూటమికి తిరుగులేదు
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమికి తిరుగులేదని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వార్డు సభ్యులు, సర్పంచ్లు కూడా పాలనలో భాగం కావాలన్నారు. అప్పుడే కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధికి నిధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే ఏకగ్రీవాలను వద్దని గొడ్డలి పార్టీ నేతలు చెప్తున్నారన్నారు. ఏకగ్రీవాలను ప్రభుత్వాలే ప్రోత్సహించాయని. మున్సిపాలిటీలు, ఆయారాం-గయారాం అనే పరిస్థితి లేకుండా కార్పొరేషన్లలో చైర్మన్, మేయర్ ఎన్నికలను ప్రత్యక్షం చేశామని అన్నారు. గొడ్డలి పార్టీ నేతలు బీసీ రిజర్వేషన్లను కూడా తగ్గించేశారని సీఎం ఆక్షేపించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరక్కుండా అడ్డుకోవడమే గొడ్డలి పార్టీ ఆలోచన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని సీఎం స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, విప్ బొలిశెట్టి శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 01-09-2026

Next Post

పడవ ఎక్కి… మత్స్యకారులతో ముచ్చటించి… 

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

కార్యకర్త
@ October 18, 2026
బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

కార్యకర్త
@ October 17, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
Load More

ముఖ్య వార్తలు

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
ఉత్సవం… ఉత్సాహం

ఉత్సవం… ఉత్సాహం

చైతన్యరధం
@ October 14, 2026
తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

చైతన్యరధం
@ October 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist