- స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుపై
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
- గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు
- పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు
- నిబంధనలకు అనుగుణంగా పెంపుపై నిర్ణయం
- ఇకపై మేయర్, చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు
- అందుకోసమే ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం
- 28 జిల్లాలకూ జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేస్తాం
- పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా వెన్నుదన్నుగా
- బీసీల్లో లెజెండరీ నాయకత్వాన్ని అందించింది టీడీపీనే
- స్థానిక సంస్థల్లో వారికి రిజర్వేషన్ల అమలు చేసింది మేమే
- గత ప్రభుత్వం బీసీ నాయకత్వానికి తీరని ద్రోహం చేసింది
- బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన
అమరావతి(చైతన్యరథం): బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేష న్ల పెంపుపై క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి, బీసీ సాధికారతకు కట్టుబడి ఉందని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా సామాజిక న్యాయమే అజెం డా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తొలిసారిగా రిజర్వేషన్‌లను వర్తింపచేస్తూ ఎన్టీఆర్ నాడు తీసుకున్న నిర్ణయం మొదలుకుని ఇప్పటివరకు జరిగిన పరిణామాలను సీఎం చంద్రబాబు సభలో వివరించారు. నిబంధనలకు అనుగుణంగా అన్ని పరిమితులకు లోబడి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పెంపుపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక ప్రాంత సంస్థల్లో 33.33 శాతం మేర రిజర్వేషన్‌లను బీసీ వర్గాలకు వర్తింపచేయనున్నట్టు ప్రకటిం చారు. ఉమ్మడి రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పంచాయతీరాజ్ చట్ట ప్రకారం రిజర్వేషన్ల పెంపును అమ లు చేస్తున్నట్టు తెలిపారు. 1995, 2001, 2006, 2013 సంవత్సరాల్లో 34 శాతం రిజర్వేషన్‌లతోనే స్థానికసంస్థల ఎన్నికలను నిర్వహించినట్టు సభకు గుర్తు చేశారు. సామాజిక న్యాయం అజెండాతో పనిచేయడం వల్లే ఎర్రన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి, యనమల, దేవేందర్‌గౌడ్, అయ్యన్నపాత్రుడు వంటి లెజండరీ నాయకత్వం బీసీ వర్గాల నుంచి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం స్థానికసంస్థల్లో బీసీల రిజర్వేషన్‌లను 24 శాతానికి కుదించడం ద్వారా 16,800 మంది స్థానిక బీసీ నేతలకు రాజకీ యాల్లో అవకాశాలు దక్కలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సామాజిక, రాజకీయ, ఆర్థిక అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసు కుందని స్పష్టం చేశారు. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌లను వర్తింపచేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ని నెరవేరుస్తూ ప్రత్యేక క్యాబినెట్ సమావేశం నిర్వహించి రిజర్వే షన్ల పెంపుపై నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ 34 శాతం రిజర్వేషన్ ప్రతిపాదనను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదిం చాలని కోరారు.
సుస్థిర పాలనకు పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలు
ఆయారాం.. గయారాం అనే విధానం కాకుండా సుస్థిరమైన పాలన అందించడం కోసమే పట్టణ స్థానికసంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చేపడతా మని సీఎం వెల్లడించారు. ఈ మేరకు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీంతోపాటు జిల్లాల విభజన జరిగినా ప్రస్తుతం 13 జిల్లా ప్రజాపరిషత్‌లే ఉండటంతో పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా ప్రజాపరిషత్‌లను ఏర్పా టు చేయనున్నట్లు ప్రకటించారు. 16వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.2,300 కోట్ల గ్రామీణ గ్రాంట్లు, రూ.1,562 కోట్ల పట్టణ గ్రాంట్లు రావాలంటే స్థానిక ఎన్నికలు నిర్వహించడం అత్యంత ఆవశ్యకమని, సరైన అభ్యర్థుల ఎంపిక ద్వారా భావి నాయకత్వాన్ని అందించాలని కూటమి నేతలను కోరారు. గ్రామీ ణ, పట్టణ ప్రాంతాలను గాంధీజీ స్ఫూర్తితో అభివృద్ధి చేయడానికి కూటమి అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు బీసీలే వెన్నెముక
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థను, వ్యవసా యాన్ని, చేతివృత్తులను నిలబెట్టింది బీసీ సమాజమేనని కొనియా డారు. రాష్ట్రంలో 50.42 శాతం ఉన్న బీసీల శ్రమకు, చీరను నేసి అగ్గిపెట్టెలో పెట్టే అద్భుత నైపుణ్యానికి సాంకేతికతను జోడించి వారి శక్తిని ప్రపంచానికి అందిస్తామన్నారు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను అత్యుత్తమంగా మార్చి విద్యకు మెరుగైన బాటలు వేస్తా మన్నారు. విద్య, నైపుణ్యం, ఉపాధి, ఎంటర్‌ప్రెన్యూర్లు, రాజకీయ ప్రాతినిధ్యం ద్వారా వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కేవలం రోడ్లు, భవనాలు, మౌలికసదుపాయాలు మాత్రమే అభివృద్ధి కాదని, ఆర్థిక అసమానతలు లేకుండా జీవన ప్రమాణా లు పెంచుతూ చివరి వ్యక్తిని ముందుకు తేవడమే అసలైన అభివృ ద్ధి అని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదని, రాజ్యాంగ పరిధిలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సామాజిక న్యాయం సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటిం చారు. బీసీ అంటే వెనుకబడిన వారు కాదు..అవకాశం రాక వెనుకబడిన వారు మాత్రమే అని స్పష్టం చేశారు.
ఎంపీటీసీ నుంచి ఎంపీగా అవకాశం
1984లో ఎన్టీఆర్ స్థానిక సంస్థలు, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌లలో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిం చగా, 73, 74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తితో తన హయాంలో ‘యాక్ట్ ఆఫ్ 5’ కింద బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు పెంచాం. అదే కోటా ప్రకారం 1995, 2001, 2006, 2013 స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. పార్టీ ప్రోత్సహించి స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తే క్షేత్రస్థాయి నుంచి నేతలుగా ఎదు గుతారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీటీసీ బస్తిపాటి నాగరాజు ను ఎంపీగా చేసి సముచిత న్యాయం చేశామని ఉదహరించారు. పంచాయతీల నుంచి కేంద్ర మంత్రివర్గం వరకు బీసీలకు ప్రాధా న్యం ఇచ్చేలా చర్యలు చేపడతామని వివరించారు.
కోర్టుల్లో కేసులు వేస్తే చరిత్ర హీనులే
శాసనసభలో ఈ ప్రకటన చేయగానే వైసీపీ కోర్టుల్లో కేసులు వేసేందుకు సిద్ధంగా ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు. మెగా డీఎస్సీ విషయంలోనూ ఇదే తరహాలో వందలాది కేసులు వేశారని తెలిపారు. ఈ రిజర్వేషన్ల విషయంలో కోర్టులకు వెళ్లి కేసులు వేస్తే వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఇంతటి చారిత్రక సమావేశానికైనా వైసీపీ నేతలు హాజరవుతారని భావించా నని, కానీ రాకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా జాతీయ జెండా ఎగురవేయకుండా నిర్ల క్ష్యం చేస్తూ అవమానించిన వ్యక్తులను ఏమనాలని ప్రశ్నించారు. గత పాలకులపై కేసులు 20 ఏళ్లుగా కింది కోర్టుకు, పైకోర్టుకూ ఊగిసలాడుతూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు.
బీసీలకు ద్రోహంలో వైసీపీ నెంబర్‌వన్
2019లో గత పాలకులు బీసీ రిజర్వేషన్ల విషయంలో 176 జీవో తెచ్చి నాటకాలు ఆడారని, సుప్రీంకోర్టుకు కూడా అప్పీలు చేయ కుండా వదిలేశారని విమర్శించారు. 559, 560 జీవోల ద్వారా రిజర్వేషన్‌లను 34 శాతం నుంచి 24.15 శాతానికి తగ్గించి 16,800 మంది బీసీ నాయకత్వానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలకు ద్రోహం చేయడంలో వైసీపీ నెంబర్‌వన్ అని ధ్వజమెత్తారు. గత పాలకులు బీసీలపై కక్షగట్టి, తమ వెనుక లేరన్న భావనతో ఇబ్బందులు పెట్టారని తెలిపారు. అచ్చెన్నా యుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాస్, కూన రవికుమార్ వంటి బీసీ నేతలపై కేసులు పెట్టి వేధించారని చెప్పా రు. రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడిని పెట్రోలు పోసి తగులబెట్టారని, టీడీపీకి మద్దతిస్తున్నారన్న కారణంతో తోట చంద్ర య్య గొంతుపై కత్తిపెట్టారని, కంచర్ల జాలయ్య, నందం సుబ్బయ్య ప్రాణాలు కోల్పోయినా సిద్ధాంతాలను వదులుకోలేదని గుర్తు చేశారు. చివరికి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా కనీసం కుర్చీ లు కూడా వేయకుండా అవమానించారని గుర్తుచేశారు. ప్రసంగం ముగించగానే ముఖ్యమంత్రి వద్దకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి అసెంబ్లీ సమావేశ మందిరంలో కృతజ్ఞతలు తెలిపారు. జయహో బీసీ అంటూ నినాదాలతో సభ మార్మోగింది












