- మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారానికి నిరసన
- కర్నూలు కొండారెడ్డి బురుజు వేదికగా ర్యాలీ
- నియామకాలపై కుట్రలు చేయొద్దు..
- టీచర్లను రాజకీయ పావులుగా మార్చొద్దు
- పాఠాలు చెబుతాం.. అవసరమైతే గుణపాఠం చెబుతాం
- మా విజయం వెనక మా తల్లిదండ్రుల కష్టం ఉంది
- మమ్మల్ని అవమానాలకు గురిచేయాలని చూడొద్దు
- ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదు
- అసత్య ప్రచారంపై భగ్గుమన్న ఉపాధ్యాయ లోకం
- ఆత్మగౌరవ ర్యాలీతో వేలాదిగా కదం తొక్కి
- వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ గళం
కర్నూలు(చైతన్యరథం) మెగా డీఎస్సీ-2025 నియామకాలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులు నిర్వహించిన ఛలో కర్నూలు ఆత్మగౌరవర్యాలీకి వేలాదిగా ఉపాధ్యాయులు తరలివచ్చారు. గొడ్డలిపార్టీ తీరును ఎండగట్టారు. కడప,అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచే కాకుండా వివిధ జిల్లాలో నుంచి వేలాదిగా తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది. పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు వేదికగా ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. తమ నియామకాలపై వాస్తవాలు వివరించినా పదేపదే ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శించారు. “ఉపాధ్యాయ నియామకాల
పై కుట్రలు చేయొద్దు.. టీచర్లను రాజకీయ పావులుగా మార్చొద్దు” అంటూ నినాదాలు చేశారు. కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో తమ కష్టం, ప్రతిభతో సాధించుకున్న ఉద్యో గాలను రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని టీచర్లు
స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో తమ ఆత్మగౌర వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఉపాధ్యాయులపై కుట్రలు చేయొద్దు
చారిత్రక కొండారెడ్డి బురుజు ఎక్కి తమ నియామ కాలపై చేస్తున్న దుష్ప్రప్రచారాన్ని ఉపాధ్యాయులు ఖండించారు. వాస్తవాలు వివరించినా పదేపదే వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో పావుగా టీచర్లను చేయొద్దం టూ వైసీపీకి హితవు పలికారు. మెగా డీఎస్సీ నియా మకాలపై కుట్రలు చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని నినదించారు. టీచర్లుగా పాఠాలు చెబు తాం.. కుట్రలు చేస్తే గుణపాఠం కూడా చెబుతామని హెచ్చరించారు. అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లు నిరుద్యోగులను మోసం చేసిన జగన్రెడ్డి మెగా డీఎస్సీపై కేసులు వేయించి అలిసిపోయారు. హారిజం టల్ రిజర్వేషన్ గురించి వైసీపీ నాయకులు గూగుల్ లో తెలుసుకోవాలని డీఎస్సీపై ఆరోపణలు చేస్తోన్న నాయకులకు మేము సవాల్ విసురుతున్నాం.. దమ్ముంటే మెగా డీఎస్సీపై చర్చించడానికి సిద్ధమని విసిరారు. నీట్ పేపర్ లేకైందని సుప్రీంకోర్టు చెప్పిం ది.. ఇక్కడ డీఎస్సీ పేపర్ లేకైందని ఏ కోర్టు చెప్పింది. ఐఏఎస్ అధికారులు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు వర కు డీఎస్సీపై సందేహాలు నివృతం చేస్తున్నారు. మా విజయం వెనక మా తల్లిదండ్రుల కష్టం ఉంది. మమ్మల్ని అవమానాలకు గురి చేస్తే సహించేది లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులం మాత్రమే.. మాపై నింద లు వేసి మీరు భంగపాటుకు గురికావద్దని హెచ్చరించారు.












