- పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి
- 15న కూటమి సమన్వయ సమావేశం
అమరావతి(చైతన్యరథం): ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరం (సర్) పూర్తయిన వెంటనే.. సెప్టెంబరు నెలా ఖరులో లేదా అక్టోబరులో స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు స్పష్టంచేశారు. కూటమి పార్టీల రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావే శాన్ని ఈ నెల 15న నిర్వహించాలని నిర్ణయించారు. జోనల్, జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయిలోనూ సమన్వయ సమావేశాలు జరగాలని సూచించారు. పార్టీ ఇన్చార్థులు లేని నియోజకవర్గాల కు త్వరలో నియమిస్తామని, కొత్త వారు కూడా కూటమి శ్రేణులతో కలిసి నడ వాలని తెలిపారు. పార్టీ ముఖ్యనేతలు, జోనల్ కోఆర్డినేటర్లతో కాన్ఫరెన్స్లో సామాజిక మాధ్యమాల వేదికగా వైకాపా దుష్ప్ర దారాన్ని తిప్పికొట్టడం, సర్, పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. రాయలసీమలో అభివృద్ధి, కొత్త పరిశ్రమలు,ఉపాధి అవకాశాలపై రాయ లసీమ రైజింగ్ పేరుతో ప్రచారం చేయా లని ఆదేశించారు. ఎమ్మెల్యేలకు రీఓరి యెంటేషన్ అవసరమని, ఆగస్టులో రెండు రోజుల వర్క్షాప్ నిర్వహిస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాలను దుష్ప్రదారానికి, విద్వేష రాజకీయాలకు వేదికగా మారుస్తూ ఆశాంతిని రేకెత్తిం చేందుకు గొడ్డలిపార్టీ చేస్తున్న ప్రయత్నా లను కూటమి పార్టీల శ్రేణులు తిప్పి కొట్టాలని సూచించారు.
















