- ఆర్గానిక్ వేరుశనగ గానుగ సందర్శన
- భువనమ్మతో ఫోన్లో మాట్లాడి
- కోల్డ్స్డ్ వేరుశనగ కొనుగోలు
- రైతు నాగభూషణానికి ప్రశంసలు
చిలకలూరి పేట(చైతన్యరథం): అన్నదాత సుఖీభవ కార్యక్రమం సందర్భంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణంకు చెందిన పొలాన్ని శనివారం సందర్శిం చారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహం, రసాయనాల వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తు న్నామని చెప్పారు. ఈ సందర్భంగా రైతు నాగభూషణం తాను చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని వివరించారు. గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు భూసారం, దిగుబడులు పెరిగి వ్యవసాయం లాభాదయకంగా మారిందని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తనకు కలిగిన లబ్ధిని, ప్రయోజనాలను తెలిపారు. నాగభూషణం లాంటి రైతులే ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శంగా నిలుస్తారని సీఎం ప్రశంసించారు. ఇదే సమయంలో నాగభూషణానికి చెందిన గానుగను కూడా పరిశీ లించారు.
వేరుశనగ, నువ్వులు, కొబ్బరి తదితర నూనెగింజలను సహజ పద్ధతిలో గానుగ ద్వారా నూనె ఉత్పత్తి చేస్తున్నట్టు రైతు వివరించారు. గానుగ ఏర్పాటు అదనపు ఆదాయవనరుగా మారిం దని, ఇటువంటి సంప్రదాయ ఆధారిత పరిశ్రమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. తాము ఉత్పత్తి చేస్తున్న కోల్ట్ప్రెస్డ్ వేరుశెనగ నూనెను అనేకమందికి సరఫ రా చేస్తున్నామని, మీరు కూడా వినియోగించాలని నాగభూషణం కోరారు. దాంతో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేసి మాట్లాడి ఒక లీటరు వేరుశనగ నూనెను కొనుగోలు చేశారు.
వివిధ రకాల పంటలతో మెరుగవుతున్న జీవ వైవిధ్యం
అనంతరం ముఖ్యమంత్రి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వన రుల కేంద్రాన్ని సందర్శించారు. జీవామృతం, ఘన జీవామృతం, వేపాస్త్రం వంటి సహజ వ్యవసాయ ఉత్పాదనలను స్థానికంగా లభించే వనరులతో తయారు చేసి రైతులకు అందజేస్తున్న విధా నాన్ని పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులకు శిక్షణ, ప్రదర్శనలు, సాంకేతిక సహాయాన్ని కూడా ఈ కేంద్రం అందిస్తోందని నాగభూషణం చెప్పారు. ఆ తర్వాత బొప్పాయి తోటను పరిశీలించి రైతు అందించిన బొప్పాయి పండును తిన్నారు. బొప్పాయితో పాటు ఇతర పంటలను సాగుతో జీవ వైవిధ్యం పెరగడంతో పాటు భూసారం, తేమ నిల్వ సామర్థ్యం మెరుగుపడుతోందని రైతు వివరించారు. చీడపీడల నివారణకు కూడా ఇది దోహదపడుతోందని వివరించారు.














