- నో బిడ్, లో బిడ్ తేడా ఉండకూడదు
- మార్కెట్కు వస్తే తిరిగి వెనక్కు వెళ్లకూడదు
- అనధికారిక కొనుగోళ్లపై కఠిన చర్యలు
- రైతులను ఆదుకునేలా కేంద్రంతో చర్చిస్తాం
- ట్రేడర్లు, పొగాకు రైతులతో సమీక్షలో చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మార్కెట్లో పొగాకు రకం ఏదైనా కిలో రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో పొగాకు రైతులు, ట్రేడర్లతో సమావే శం నిర్వహించి పొగాకు ధరలపై సమీక్షించారు. ఇటు రైతులు, అటు ట్రేడర్ల సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు రైతులను ఆదుకునేందుకు ట్రేడర్లు, కొనుగోళ్ల కంపెనీలు సూటికి నూరు శాతం మాసవీయ కోణంలో రైతులకు సహకరిం చాలని స్పష్టం చేశారు. పొగాకు వేలం కేంద్రాల్లో నో బిడ్, లో బిడ్ అనే మాటలకు తావుండకూడదన్నారు. రైతులు మార్కెట్కు తెచ్చిన పొగాకు బేళ్లను వెనక్కి పంపే పరిస్థితులు అస్సలు ఉండకూడదని చెప్పారు. మార్కెట్లోకి వచ్చిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగా అన్ని పొగా కు వేలం ప్లాట్ఫారమ్లను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని చేయాలని ఆదేశించారు.
అలాగే పొగాకు కంపెనీలన్నీ తప్పనిసరి గా కొనుగోళ్లు చేపట్టాలని, ఏ ఒక్క కంపెనీ కూడా వెనక్కు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. టొబాకో బోర్డ్ పరిధిలో కాకుండా అనధికారికంగా కొనుగోళ్లు జరిపిన వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టులు చేస్తామని హెచ్చరిం చారు. తనకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ ఏడాది పొగాకు ట్రేడర్లు, కంపెనీలు ప్రభుత్వానికి, రైతులకు సహకరించాలని కోరారు. రాబోయే ఏడాది నుంచి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని, ప్రత్యా మ్నాయ పంటలను ప్రోత్సహిస్తామని తెలిపారు. అలాగే పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్ని స్తుందని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. రైతులు, టొబాకో బోర్టు ప్రతినిధులను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రులు, అధికారులను కలవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయు డును ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డీవీబీ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, టొబాకో బోర్డ్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
















