అమరావతి (చైతన్యరథం): ‘సినీ వినీలాకాశంలో ఐదు దశాబ్దాలుగా ధ్రువతారగా వెలుగొందుతున్నారు… మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో-అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తున్నారు… శాసనసభ్యునిగా హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో సరికొత్త కార్డు సృష్టిస్తూ అజేయంగా ముందుకెళ్తున్నారు. నవరస నటనా సార్వభౌముడు, అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులు మీపై కలకాలం ఉండాలి. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి.’ అంటూ ‘పద్మభూషణ్’, హిందూపురం ఎమ్మెల్యే, ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో జన్మదిన శు భాకాంక్షలు తెలిపారు.















