అమరావతి(చైతన్యరథం): బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు వేదికపై పొలిట్బ్యూరో సభ్యు లు ఎం.ఎ.షరీఫ్ సహా ముస్లిం నేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
త్యాగం, విశ్వాసానికి ప్రతీక బక్రీద్: లోకేష్
టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, విశ్వాసం, అల్లాహ్ ఆజ్ఞల పట్ల సంపూర్ణ విధేయత కు ప్రతీక అయిన బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరసోదరీ మణులకు శుభా. కాంక్షలు. హజ్రత్ ఇబ్రహీం చూపిన త్యాగ భావం మానవాళికి ఆదర్శం. సమాజ శ్రేయస్సు, సోదరభావం, మానవతా విలు వలు వెల్లివిరిసే బక్రీద్ పండుగను ఆ అల్లాహ్ దీవెనలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.















