చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్

by చైతన్యరధం
Apr 30, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాధ్యత పెంచింది
  • ఒక్కడినే అన్న అహం లేదు..కలిసికట్టుగా పనిచేద్దాం
  • దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనం
  • నాడు, నేడు, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలబడతా
  • పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళదాం
  • సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా నడిపిస్తున్నాం
  • వైకాపా సినిమాకు ఎండ్‌కార్డ్ వేసేది పసుపు సైన్యమే
  • టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం సభలో
  • నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్

మంగళగిరి(చైతన్యరథం): నాయకులు, కార్యకర్తల త్యాగాల తోనే ఈ స్థాయికి వచ్చా..చిన్న వయసులో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇచ్చారు.. నాయకులు, కార్యకర్తలు, తెలుగుజాతి కోసం అహర్నిశలు కృషిచేస్తానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ, రాష్ట్ర నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార ముగింపు సభలో లోకేష్ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం..తెలుగుజాతిని ప్రపంచపటంలో పెట్టింది మన లెజెండ్ సీబీఎన్.. దేశ రాజకీయాల్లో మన పార్టీ ఒక ప్రభంజనం. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకు వచ్చారు అన్న ఎన్టీఆర్. రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్ర. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు.. ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. ఓడిపోయి నప్పుడు వెనకడుగు వేయలేదు.. గెలిచినప్పుడు కాలర్ ఎగరేసుకు ని తిరగలేదు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించిన పార్టీ తెలుగుదేశం అని ఉద్ఘాటించారు.

బాధ్యత మరింత పెరిగింది..టీంగా ముందుకెళదాం
44 ఏళ్ల గొప్ప చరిత్ర ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి నన్ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ నాయకులకు పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఈ పదవి అనౌన్స్ చేసినప్పుడు నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నా. ఏం చేస్తే ఈ పదవికి న్యాయం జరుగు తుందనే విషయం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. ఓ వైపు బాధ్యత..మరోవైపు ఈ బరువును కూడా మోయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నా ఒక్కడి వల్ల కాదు. వేదికపై ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు, వేదిక ముందున్న నాయకుల వైపు నేను చూస్తున్నా. కలిసికట్టుగా మనం చేయాలి, కలిసికట్టుగా మనం ముందుకువెళ్లాలి. అప్పుడే మనం అనుకు న్నది సాధించగలం. నేను ఒక్కడినే చేయగలననే అహంకారం నాకు లేదని పేర్కొన్నా రు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

కార్యకర్తల త్యాగాలే స్ఫూర్తి..అండగా నిలబడతా
నాడు, నేడు, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలబడతానని పాదయాత్రలో హామీ ఇచ్చా. నియోజకవర్గ పర్యటనల్లో నేను, చంద్రబాబు ముందుగా కార్యకర్తలను కలుస్తున్నాం. చివరి వ్యక్తితో ఫొటో దిగిన తర్వాతనే తిరిగిరావడం జరుగుతోంది. ఐదేళ్లలో నర కం అనుభవించాం. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడున్న ప్రతి నాయకుడిపై అక్రమ కేసులు పెట్టారు, వేధించారు. పుంగ నూరు నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు లాక్కోవాలని అనుకున్నప్పుడు తొడగొట్టి మీసాలు మెలేసిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి. మెడపై కత్తి పెట్టినా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య నాకు ఆదర్శం. పల్నాడులో రక్తం కారుతున్నా చివరి ఓటు పడేవరకు బూత్‌లో నిలబడిన మంజుల నాకు స్ఫూర్తి. వారి నాయకుడిని విమర్శిస్తు న్నారని కన్నుపోయే విధంగా చెన్నుపాటి గాంధీపై దాడి చేశారు. అయినా ఎత్తిన జెండా దించకుండా, మడమ తిప్పకుండా జై తెలు గుదేశం అని నినదించిన చెన్నుపాటి గాంధీ నాకు స్ఫూర్తి అని తెలిపారు.

పార్టీ సిద్ధాంతాలే మనకు బలమైన పునాది
కోటి సభ్యత్వాలతో రికార్డ్స్ బద్దలు కొట్టాం. ప్రమాదబీమా రెండు లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాం. ఇప్పటివరకు సుమారుగా కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేశాం. విద్య, వైద్యం, స్వయం ఉపాధికి సాయం అందిస్తున్నాం. కార్యకర్తలకు అండగా నిలబడతాం. 44 ఏళ్ల ప్రయాణంలో పడ్డాం, లేచాం కానీ నిలబడ్డాం. ఎప్పుడూ అధైర్యపడలేదు. దానికి ప్రధాన కారణం మన సిద్ధాంతాలు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని చెప్పిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ వచ్చాం. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం 6 శాసనాలు రూపొందించుకున్నాం. అందు లో మొదటిది తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో-సామాజిక న్యాయం, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేత. మన పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలి. మనం అందరం సిద్ధాంతాల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

జోడెద్దుల బండిలా సంక్షేమం, అభివృది
గడిచిన రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా నడిపిస్తున్నాం. మనం అందిస్తున్న సంక్షేమం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలు చేసింది మనం. ఇప్పుడు రూ.4 వేల పెన్షన్ ఇస్తోంది మనమే. దివ్యాం గులకు రూ.6 వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తోంది మనమే. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు. ధనిక రాష్ట్రాలు కూడా ఇవ్వడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటు న్నాం. దీపం పథకం కింద ఏటా ఉచితంగా 3 సిలిండర్లు అందిస్తు న్నాం. 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేశాం. 6 వేల కానిస్టే బుళ్ల పోస్టులు భర్తీ చేశాం. 10,060 పోస్టులతో జాబ్ క్యాలండర్ విడుదల చేసిందీ మనమే. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికివందనం ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు.

మీ సినిమా విధ్వంసం, మా సినిమా అభివృద్ధి
పెట్టుబడుల్లో కూడా ఏపీ నెం.1. దేశానికి వంద రూపా యలు పెట్టుబడి వస్తే మన రాష్ట్రానికి 25 రూపాయల పెట్టుబడి వస్తోంది. మనది గూగుల్.. వైసీపీది గొడ్డలి. ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతు న్నారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రెన్యూ, టీసీఎస్, కాగ్నిజెం ట్, రిలయన్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే 800 ముఖ్యమైన ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి వచ్చాయి. యుద్ధప్రాతిపదికన గ్రౌండింగ్ చేస్తున్నామని వివరించారు. మనకి సినిమా చూపిస్తా అంటున్న రప్పా రప్పా బ్యాచ్‌కి ఒకటే చెబుతున్నా. మీ సినిమా విధ్వంసం.. మా సినిమా అభివృద్ధి. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మామయ్య. బాలయ్య బాబు తొడకొడితే ఒక్కరు కూడా ఉండరు. ఈ సైకో బ్యాచ్ బతకదు. మీ సినిమాకు ఎండ్ కార్డ్ వేసేది మా పసుపు సైన్యమే. ఇది గుర్తుపెట్టుకోవాలి.

కార్యకర్తే అధినేత..అందుకు వారే నిదర్శనం
మై టీడీపీ యాప్ ద్వారా పనిచేసే వారిని గుర్తిస్తున్నాం. టెక్నాలజీతో అనుసంధానం కావాలి. మై టీడీపీ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. మీరు చేసే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియ జేస్తే తప్పనిసరిగా జల్లెడ పట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ తెలుగు దేశం పార్టీ వస్తుంది. ప్రజల చుట్టూ తిరిగి వారి సమస్యలను పరిష్కరిద్దాం. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది. గదు ల్లో కూర్చొని పనిచేస్తే మన ఆశయాలు సాధించలేం. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను బయట ఎంత పోరాడతానో పార్టీ లోపల అంత పోరాడతాను. పార్లమెంట్ వ్యవస్థ తీసుకు రావడానికి ఎంతో కష్టపడ్డాను. అనుకున్న లక్ష్యాలు సాధించే వరకు అహర్నిశలు కష్టపడదాం. పార్టీలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కదలిక రావాలి. గ్రామ కమిటీలో పనిచేసిన వారు మండల కమిటీకి రావాలి. మండలస్థాయి నుంచి పార్లమెంట్ స్థాయికి, పార్లమెంట్ నుంచి రాష్ట్ర స్థాయికి, అక్కడి నుంచి జాతీయ కమిటీ, పొలిట్ బ్యూరో వరకు రావాలి. అప్పుడే పార్టీలో కదలిక వస్తుంది. ఈ రోజు మండల పార్టీ అధ్యక్షురాలు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌ను ఏకంగా పొలిట్‌బ్యూరోలో కూర్చోబెట్టిన ఘనత మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబుది.

ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం
ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా ముఖ్యం. గుజరాత్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం వరుసగా ఉండటం వల్ల ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. గడిచిన ఐదేళ్లు చాలా నష్టపోయాం. విధ్వంస పాలన మనం చూశాం. అందుకే మనం అందరం కష్టపడాలి. అహర్నిశలు పోరాడాలి. 2029లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తోంది. విశాఖ ఉక్కును కాపాడుకున్నాం, విశాఖ రైల్వేజోన్ సాధించుకున్నాం. త్వరలో కర్నూలులో హైకో ర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. అమరావతి పనులు వేగంగా జరుగు తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రానికీ పార్లమెంట్ సాక్షిగా ఇదీ రాజధాని అని చెప్పలేదు. ఒక్క అమరావతి విషయంలోనే చెప్పారు. కేంద్రంలో మన ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్య మైంది. పోలవరానికి నిధులు తీసుకువచ్చాం. చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో పవనన్న అండగా నిలిచారు. కనీసం పదిహేనేళ్లు ఎన్డీయే ప్రభుత్వం కొనసాగాలని పవనన్న స్పష్టంగా చెప్పారు. పొత్తు ధర్మం అందరం పాటించాలి. కలిసిక ట్టుగా పోరాడాలి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. దీనికి మనందరి సహకారం చాలా అవసరం.

రాష్ట్రంలో క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నారు
మన రాష్ట్రంలో క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నారు. సారీ.. మన రాష్ట్రంలో కాదు.. బెంగళూరులో ఉంటారాయన. ఇప్పుడు ఆయనది దీజుచీ-TA-HY. మూడురోజులు బెంగ ళూరులో, మూడురోజులు హైదరాబాద్‌లో, ఒకరోజు తాడేపల్లి లో ఉంటారు. ఒక్క కంపెనీ తీసుకురారు..ఒక్క పనీ పూర్తి చేయరు. మనం తీసుకువస్తే మేమే చేశామంటారు. గూగుల్ ఇందుకు ఉదాహరణ. మొదటి మీటింగ్ విశాఖలో మనం రహస్యంగా పెట్టుకున్నాం. తర్వాత నేను ఫాలోఅప్ చేశా. వారు వచ్చి సీఎంని కలిశారు. వారు రెండు, మూడు మార్పులు కావాలి చట్టంలో అంటే.. కేంద్రంతో మాట్లాడాం. ఇప్పుడు క్రెడి ట్ చోరీకి పాల్పడుతున్నారు. గూగుల్‌కు భూములు కేటాయిం చవద్దని ఆ పార్టీ ఎంపీనే కోర్టులో పిల్ వేస్తారు. ఎంత అన్యాయమో మనం ఆలోచించాలి. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వివేకానందరెడ్డిని వారే చంపి నెపం మనపై వేశారు. దుష్ప్ర చారాలను తిప్పికొట్టలేకపోయాం. మనందరిపై బాధ్యత ఉంది. క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉన్న వ్యక్తి ఇంకా అనేక అబద్ధాలు చెబు తాడు. ప్రజలను మభ్యపెడతారు. మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.

నాయకులను తయారుచేద్దాం
ఈ భూమిపైన ఎవరూ శాశ్వతం కాదు.. టీడీపీ అనే వ్యవస్థ శాశ్వతం. మనం పార్టీని బలోపేతం చేద్దాం. పది మంది నాయ కులను తయారుచేద్దాం. సామాన్య కార్యకర్తను నాయకుడిగా తయారుచేద్దాం. అహర్నిశలు కృషిచేసి పార్టీని బలోపేతం చేద్దాం. ఈ రోజు పార్టీ ఒక వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, సెక్రటరీగా, ఆర్గనైజ్ సెక్రటరీగా గుర్తించింది అంటే.. మన చంద్రబాబు జల్లెడ పట్టి గుర్తించడం జరిగింది. వారిని గౌరవించాలి. వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. అహంకారం ఉంటే ఎమవుతుందో మనం 2024 ఎన్నికల్లో చూశాం. 151 కాస్తా 11 అయ్యాయి. ప్రతిపక్ష హోదా రాలేదు. మనం కలిసి కట్టుగా పనిచేద్దాం. మన సమస్యలు మనమే పరిష్కరించు కుందాం. నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజల సమస్యలు పరిష్కరించాలి.

మీ త్యాగాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను
చిన్న వయసులో నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. నేను ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం వేదికపై ఉన్న నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటిమంది కార్యకర్తలు. మీ త్యాగాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. ఆ రోజు మీరు నాతో నడిచారు కాబట్టే యువగళం పాదయాత్ర సక్సెస్ అయింది. ఏ చిన్న సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలి. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకోసం, కార్యకర్తల కోసం, ఆంధ్రుల కోసం, తెలుగుజాతి కోసం నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నా. అద్భుత మైన అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

Next Post

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026

కార్యకర్త
@ April 30, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

కార్యకర్త
@ April 29, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం
ఆంధ్రప్రదేశ్

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు
ఆంధ్రప్రదేశ్

ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

చైతన్యరధం
@ April 29, 2026
Load More

ముఖ్య వార్తలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist