- 2.1 శాతం లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలి
- ఉమ్మడి-పెద్ద కుటుంబాలకు ప్రోత్సాహకాలు
- కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి
- పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై సమీక్షలో చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): జనాభా నియంత్రణ నుంచి జనాభా సంరక్షణ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ విధానం అమలుపై అధికారులతో బుధవారం సమీక్షించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 2.1 శాతం నుంచి 1.5కి తగ్గిందని అధికారులు వివరించారు. అత్యధికంగా కడప జిల్లాలో 1.99 ఫెర్టిలిటీ రేటు ఉంటే, అత్యల్పంగా 1.32 విశాఖపట్నంలో నమోదైందని ముఖ్యమంత్రికి వివరించారు. సంతానోత్పత్తి రేటు 2.1 శాతానికి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని, ఆ దిశగా లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా చంద్రబా బు దిశానిర్దేశం చేశారు. తల్లికి వందనం పాపులేషన్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో భాగమేనని చెప్పారు. మన దేశ కుటుంబవ్యవవ్థ పటిష్టంగా ఉంది..దీనిని కాపాడుకునేం దుకు మైక్రో ఫ్యామిలీ సంస్కృతి విస్తరించకుండా చూడాలని సూచించారు. ఉమ్మడి-పెద్ద కుటుంబాలకు అధిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రణాళిక రూపాందించాలని ఆదేశించారు.
జనాభా నిర్వహణ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. పాపులేషన్ మేనేజ్‌మెంట్‌తో పాటు.. ప్రజారోగ్య రక్షణకు కార్యా చరణ చేపట్టాలన్నారు. అలాగే సమతుల్య ఆహారం తీసుకోకపోవ డం వల్ల ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారని, పోషకాహారం-ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి పెట్టేలా చూడాలని సూచించారు. ఆయుర్వేద, నేచురోపతి చికిత్సా విధానాలను కూడా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా ఆస్పత్రులకు వచ్చిన రోగులకు వారి రికార్డుల ఆధారంగా డైట్ ప్యాట్రన్, పోషకాహారం అందించా లని స్పష్టం చేశారు. ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక, స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డు శాఖ, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.















