- రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కుట్రలు చేస్తున్నారు
- అధికారం ఉంటే విధ్వంసం..లేకుంటే బెదిరింపులు
- నాడు మూడు రాజధానులు..నేడు మావిగన్ నాటకాలు
- అమరావతికి రూ.2 లక్షల కోట్లని ప్రచారం చేస్తున్నారు
- ఆ పేరే చెప్పడానికి ఇష్టపడని వ్యక్తికి పాలించే అర్హత లేదు
- నాడు రైతులు, మహిళలను చిత్రహింసలకు గురిచేశారు
- ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు న్యాయమే గెలిచింది
- సాక్షి పత్రికలో వ్యక్తిత్వ హననం మరిచిపోయారా?
- మాది న్యాయబద్ధ పాలన..ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం
- తల్లిని కోర్టుకీడ్చిన వ్యక్తికి మహిళలపై మాట్లాడే అర్హతుందా?
- సూరేపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
బాపట్ల(చైతన్యరథం): అమరావతి పేరు పలకడం కూడా ఇష్టపడని వ్యక్తికి పాలించే అర్హత ఎక్కడిది? జగన్ లాంటి వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజక వర్గంలో మీ భూమి`మీ హక్కు సభలో ఆయన ప్రసంగించారు. మొన్నటివరకూ మూడు రాజధానులు..ఇప్పుడు మావిగన్ అంటు న్నారు. విజయవాడ, గుంటూరు సమీపంలో రాజధాని కట్టేందుకు నేను ఇచ్చిన పిలుపుతో 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. దేవతల రాజధాని అమరావతి. ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన నీరు, మట్టి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. హైకోర్టు, సుప్రీంకోర్టు అమరావతికి మద్దతుగా నిలిచాయి. 2019కి ముందు బాబాయిని చంపి ఆ నేరాన్ని నాపై వేశాడు. నా చేతిలో కత్తి పెట్టి సాక్షి పత్రికలో తప్పుడు కథనం రాశారు.
అమరా వతిపై కక్ష గట్టి రైతుల త్యాగాలకు విలువ లేకుండా చేశారు. అమరావతి నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చు అని అసత్య ప్రచారం చేస్తున్నాడు. అమరావతి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. మహిళా రైతులను ఇబ్బందులు పెట్టారు. మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్లతో చిత్రీకరించారు. వారిని జట్టు పట్టుకుని బయటకు లాగారు. లాఠీలతో కొట్టారు. న్యాయస్థానం టూ దేవస్థానం కార్యక్రమం చేపడితే రోడ్డుపై భోజ నం చేయనివ్వకుండా హింసించారు. అమరావతి నుంచి అరసవిల్లి వెళ్లాలంటే వారిపై దౌర్జన్యం చేశారు. మహిళల గురించి, తన సతీమణి గురించి వ్యక్తిగత దూషణలు చేశారు. గత ఐదేళ్లలో మహిళలను హింసించిన వాళ్లకు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి మహిళలు వీరోచితంగా పోరాడారు. చివరకు న్యాయం గెలిచింది. అమరావతి అజరామరం. అమరావతే ఏపీ రాజధాని అని రాష్ట్రప తి ఆమోదం తెలిపారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తే ఒకే ఒక్క సైకో పార్టీ సపోర్ట్ చేయలేదదని గుర్తుచేశారు.
అప్పుడు విధ్వంసం..ఇప్పుడు బెదిరింపులు
“నాడు ఐదేళ్లు అధికారంలో ఉండి విధ్వంసం సృష్టించారు ..అధికారం పోయాక బెదిరిస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడి కి యత్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక విచారణలు చేసి అందర్నీ పట్టుకొస్తానని బెదిరిస్తున్నాడు. సాక్షి పత్రికలో రాసిన రాతలు, మహిళలపై చేసిన వ్యక్తిత్వ హననం మరిచిపోయారా? రాజకీయ పార్టీ లేకపోతే జగన్ ఇంట్లో నుంచి బయటకు రాగల రా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కుట్ర చేస్తున్నారు. మాది న్యాయబద్ధ పాలన..ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. ప్రజలకు ఇబ్బం దులు వస్తే ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడాను. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. జగన్రెడ్డి అప్పుడ ప్పుడు రాష్ట్రానికి వచ్చి బెదిరించి పారిపోతాడు. ఇలాంటి నేతలు మనకు అవసరమా? 50 మందిని పోగేసుకొచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం కష్టం కాదు. చట్ట ప్రకారమే వెళతాం. ఏ తప్పూ చేయని నన్ను నోటీస్ కూడా ఇవ్వకుండా జైల్లో పెట్టాడు. ఇలాంటి నేతలను ప్రోత్సహిస్తే ఎవరికీ రక్షణ ఉండదు..భవిష్యత్ ఉండదు. అందరి జీవితాలు బాగుండాలంటే ఇలాంటి వ్యక్తులను మర్చిపోవాలి. ఏమారితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని హెచ్చరించారు.















