- 78వ బ్యాచ్‌కు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లు
మంగళగిరి(చైతన్యరథం): మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలో “స్త్రీ శక్తి సంక్షేమం” కార్యక్రమం ద్వారా మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ఉచితంగా శిక్షణతో పాటు కుట్టుమిషన్లను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా నియోజకవర్గంలో శిక్షణ పొందిన 78వ బ్యాచ్ (తాడేపల్లి యూనిట్ బ్యాచ్)కు చెందిన 30 మంది మహిళలకు నారా లోకేష్ సొంత నిధులతో ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికె ట్లు పంపిణీ చేశారు. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాల యం ఎంఎసఎస్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజక వర్గ తెలుగు మహిళల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేష్ మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాల ద్వారా మహిళలు తమ ప్రతిభను అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధి సాధించవచ్చని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ మహిళా అధ్యక్షరాలు అన్నెం కుసుమ, మండల మహిళా అధ్యక్షురాలు బొర్ర కృష్ణ వందన, మహిళా నాయకులు తాడేపల్లి పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ కొయ్యగూర మహాలక్ష్మి, మాజీ కౌన్సిలర్ కాటా బత్తుని నిర్మల, కోడూరుపాటి విజయ ఊర్మిళ, మరీదు పుష్పాంజలి తదితరులు పాల్గొన్నారు.














