- 25, 26 తేదీల్లో మంగళగిరిలో నిర్వహణ
- ఎల్ఈడీ స్క్రీన్లపై మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం
మంగళగిరి(చైతన్యరథం): యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొం దించేందుకు, క్రికెట్ అభిమానులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మంగళ గిరిలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారని నియోజక వర్గ తెలుగుయువత అధ్యక్షుడు బోగి వినోద్ తెలిపారు. ఈ ఫ్యాన్ పార్క్‌ను ఏప్రిల్ 25, 26 తేదీలలో మంగళగిరి పట్టణ టిడ్కో గృహ సముదాయం వద్ద గల పార్క్‌లో ఘనంగా నిర్వహించను న్నారని వివరించారు. ఈ సందర్భంగా భారీ ఎలఈడీ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారంతో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రదర్శించనున్నారని తెలిపారు. కుటుంబసభ్యులు, యువత, క్రికెట్ అభిమానులు అంద రూ కలిసి ఉత్సాహభరిత వాతావరణంలో మ్యాచ్‌లను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని, యువతలో ఐక్యతను పెంపొందిం చడమే కాకుండా, క్రీడల పట్ల ఆసక్తిని మరింతగా పెంచే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడనుందని తెలిపారు. మంగళగిరి ప్రజలు, ముఖ్యంగా క్రికెట్ అభిమానులు ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.














