అమరావతి (చైతన్య రథం): ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. “శెట్టిబలిజ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవం తీసుకువచ్చిన గొప్ప సామాజిక సంస్కర్తగా దొమ్మేటి వెంకటరెడ్డి గుర్తింపు పొందారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి.. వారి అభ్యున్నతికి విశేషంగా కృషిచేశారు. ఆయన జయంతిని ప్రజాప్రభుత్వం రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తోంది. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి నిరంతరం కృషిచేసిన దొమ్మేటి వెంకటరెడ్డి సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం” అని విద్య, ఐటి మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

















