- ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు
- మీ త్యాగానికి ప్రతిఫలమే ప్రాజెక్టు
- వారంరోజుల్లో డయాఫ్రాం వాల్ పూర్తి
- గత పాలకుల నిర్వాకంతో ఏళ్ల తరబడి ఆలస్యం
- నాటి తప్పులను సరిచేస్తూ ముందుకెళుతున్నాం
- వచ్చే ఏడాది ఉగాది తర్వాత జాతికి అంకితం
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
- మూడోవిడత రూ.226 కోట్ల పరిహార ప్యాకేజీ
- నిర్వాసితుల్లో భావోద్వేగం, హర్షాతిరేకాలు
అమరావతి (చైతన్యరథం): పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేశారు.. వారి త్యాగఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతోంది.. నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమం త్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్యాంపు కార్యాలయంలో బుధ వారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు. భూసేకరణ పునరావాస, పరిహార ప్యాకేజీ కింద మూడో విడతలో రూ.226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మూడో విడతగా నిర్వాసితుల ఖాతాలకు ఈ మొత్తాన్ని జమ చేస్తున్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని అది పూర్తి కావటంతో పాటు నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం కలుగు తుందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంగా వల్ల డయాఫ్రాం వాల్ దెబ్బతిందని.. నిపుణులతో అధ్యయనం చేయించి ఇప్పుడు మళ్లీ రూ.వెయ్యి కోట్లతో కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపడు తున్నామని స్పష్టం చేశారు. వారంరోజుల్లో డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి అవుతుందని, ప్రాజెక్టులో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయన్నారు. 21 నెలల్లో ప్రాజెక్టు పనులు ముమ్మరం చేశామని వివరించారు. వచ్చే ఏడాది ఉగాది తర్వాత రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని.. రాష్ట్ర ప్రజలం దరి కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. గత పాలకులు నిర్వా సితులను పట్టించుకోలేదని… వరద నీటిలో ప్రజలు మునిగిపో తున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని సీఎం నాటి సంగతులను గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును, నిర్వాసితులను దృష్టిలో ఉంచుకునే రంపచోడవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాగా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్దతో ఈనిర్మాణాన్ని పూర్తి చేస్తోందని అన్నారు.
21 నెలల్లో రూ.1943 కోట్ల పరిహారం చెల్లింపు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రాజెక్టు నిర్వాసితులకు వేగంగా చెల్లింపులు చేశామని వివరించారు. 2025 జనవరిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మొద టి విడతగా నిర్వాసితులకు రూ.800 కోట్లు ఇచ్చాం. గత ఏడాది దీపావళికి రెండో విడతగా రూ.916 కోట్లను నిర్వాసితుల ఖాతా ల్లో జమ చేశాం. ఇప్పుడు మూడో విడతగా ఉగాదిని పురస్కరిం చుకుని నిర్వాసితులకు రూ.226.6 కోట్లను చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. మొత్తంగా 21 నెలల్లో 26,149 మంది. నిర్వాసితులకు రూ.1943 కోట్లను చెల్లించామని తెలిపారు. రెండు దశల్లో జరిగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తొలి దశలో 38,068 మంది నిర్వాసితులను తరలించేందుకు చర్యలు చేపట్టాం. 75 నిర్వాసిత కాలనీల్లో ఇప్పటికే 26 పూర్తి అయ్యాయి. ఇంకా 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి. 2022లో గుర్తించిన 17,114 మంది నిర్వాసితులకు కాలనీలను నిర్మించి తరలించేలా చర్యలు చేపడుతున్నాం. 2027 ఏప్రిల్ కల్లా కాలనీలు పూర్తి చేసి పునరావాసం కల్పించేలా సంకల్పించామని వివరించారు. ఇంకా రూ.3,500 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. ప్రతీ నిర్వాసితుడికి రూ.3.5 లక్షల మేర ఇంటి నిర్మాణం కోసం ఇస్తు న్నామని.. ఇంటి జాగా కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచామని తెలిపారు. గత పాలనలో జరిగిన తప్పులను సరిదిద్ది నిర్వాసితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నా మని తెలిపారు. పునరావాస, పరిహారాన్ని పారదర్శకంగా నిర్వాసి తులకు చెల్లిస్తున్నామని చెప్పారు. మూడో మారు గోదావరి పుష్కరా లు నిర్వహించే గౌరవం తనకు దక్కిందని.. పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని స్పష్టం చేశారు.
గత పాలకులు అహంకార ధోరణితో వ్యవహరించారు
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు 6-7 ఏళ్ల పాటు ఆలస్యం అయిందని నిర్వాసితులకు వివరించారు. కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను మార్చకుండా ఉంటే ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. నిర్వాసితులకు కూడా పూర్తి న్యాయం జరిగి ఉండేది. ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తికి మరో రూ.5 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే కంటే ముందే నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని సీఎం హామీ ఖర్చు చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులంతా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. నిర్వాసితులు అంతా సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు ఏమైనా పర్వాలేదనే అహంకార ధోరణితో గత పాలకులు వ్యవహరిం చారని సీఎం ఆక్షేపించారు. పోలవరం నిర్వాసితుల పట్ల తమ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది. నిర్వాసిత యువతకు స్కిల్ డెవలప్మెంట్లోనూ శిక్షణ ఇస్తామని వివరించారు. నిర్వాసితుల నుంచి వచ్చే అభినందనలను ప్రజాప్రతినిధులుగా తమకు, అధికా రులకు గౌరవంగా భావిస్తామని తెలిపారు.
పరిహారం చెల్లింపులతో నిర్వాసితుల్లో భావోద్వేగం
గడచిన 21 నెలలుగా కూటమి ప్రభుత్వం తమ ఆవేదనను గుర్తించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద డబ్బులు జమ చేస్తోందని నిర్వాసితులు ముఖ్యమంత్రికి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నుంచి వచ్చిన నిర్వాసితులు హర్షాతిరేకాల మధ్య తమ అభిప్రాయాలను సీఎం ముందు వెలిబుచ్చారు. గత పాలనలో తమకు న్యాయం జరగలేదని.. కూటమి అధికారంలోకి వచ్చాకే పునరావాస, పరిహార ప్యాకేజీ నిధులు తమ ఖాతాల్లోకి వచ్చాయని.. వీటితో తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితులను మెరుగు పరుచుకుంటున్నామని వివరించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కలకాలం పాలన సాగించాలని నిర్వాసిత మహిళలు భావో ద్వేగంతో వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ జి.సాయిప్రసాద్, ఆర్ అండ్ ఆర్ అధికారులు హాజరయ్యారు.















