చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దివ్యాంగ శక్తి’తో ఆత్మగౌరవం

కూటమి కలకాలం ఉండాలని దివ్యాంగుల హర్షం

by చైతన్యరధం
Mar 19, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
దివ్యాంగ శక్తి’తో ఆత్మగౌరవం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సాయంతో పాటు ఖర్చులూ తగ్గిస్తున్నాం
  • ఎల్లప్పుడూ వారికి సంక్షేమాన్ని ఇచ్చేది మేమే
  • ఎన్టీఆర్ కార్పొరేషను ఏర్పాటు చేశారు
  • పింఛను పెంచి అమలు చేస్తున్నాం
  • వారి కోసం ఇంకా మంచి పనులు చేస్తాం
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
  • ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం
  • మంగళగిరి నుంచి పెనుమాక వరకూ జర్నీ
  • అనంతరం నివాసంలో వారికి ఆత్మీయ విందు
  • కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్
  • కూటమి కలకాలం ఉండాలని దివ్యాంగుల హర్షం

అమరావతి(చైతన్యరథం): దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా ఆత్మస్థైర్యంతో పనిచేసేలా తమ ప్రభుత్వం ప్రోత్సహి స్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దివ్యాంగుల సాధికారతకు, వారి గౌరవాన్ని మరింత పెంచడానికి కూటమి ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పథకం ప్రారంభం అనంతరం మంగళగిరి బస్టాండ్ నుంచి రాజధానిలోని పెనుమాక వరకు దివ్యాంగు లతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యా ణ్, మంత్రి నారా లోకేష్ బస్సులో ప్రయాణించారు. సుమారు 11 కిలోమీటర్ల మేర జర్నీలో వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పథకాలు, కార్యక్రమాలను వివరించారు. దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేసిన అనంతరం ఉండవల్లి నివాసంలో దివ్యాంగ శక్తి పథకంలోని పలువురు లబ్దిదారులకు సీఎం  ఆత్మీయ విందు ఇచ్చారు. వారితో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భోజనం చేశారు. ఈ పథకం ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్దిదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ ముందుకు సాగారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించటంపై ముఖ్యమంత్రి చంద్రబా బుకు దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు. తమ వెంట వచ్చే సహాయ కులకు ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పించటంపై హర్షం వ్యక్తం చేశారు.

దివ్యాంగుల్లో ఆత్మ విశ్వాసం నింపుతాం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దివ్యాంగ శక్తి పథకంతో ఈ ఉగాది మరింత వేడుకగా జరుపుకోండి. అందరికీ ఉగాది శు భాకాంక్షలు. 21 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. దివ్యాంగ శక్తి పథకం ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తోంది. నేను, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి ప్రయాణించటం సంతృప్తిని ఇచ్చింది. దివ్యాంగులంటే విభి న్న ప్రతిభావంతులు, సమస్యను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్న వాళ్లు. గతంలో చేయూత కార్యక్రమం ద్వారా దివ్యాంగు లకు సహాయం చేశాం. దివ్యాంగులకు పింఛను కింద రూ.6 వేలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే. రూ.500 ఉండే దివ్యాంగుల పెన్షన్ ను రూ.6 వేలకు పెంచి ఇస్తున్నాం. తీవ్ర ఆరోగ్య ఇబ్బందుల్లో ఉండే వారికి రూ.10 వేలు, మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. ఏటా పింఛన్ల కోసం రూ.33 వేలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడు బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఎలాంటి ఖర్చు లేకుండా దివ్యాంగులు ఇక ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పనులకు, అవసరాలకు ఖర్చు లేకుండా ప్రయాణం చేయవచ్చు. నెలకు రూ.2 వేల దాకా ఆదా అయ్యే అవకాశం ఉంది. మొదటి నుంచి మేమే దివ్యాంగుల సంక్షేమానికి పనిచేస్తున్నాం. భవిష్యత్తులోనూ దివ్యాంగులనుఆదుకునేలా మరిన్ని ఆలోచనలు చేస్తాం. ఎంత ఖర్చు చేస్తున్నామో చూడడం లేదు.. దివ్యాంగులకు గౌరవాన్ని ఏ మేరకు పెంచుతు న్నామనే అంశం పైనే దృష్టి సారించాం. కూటమి అమలు చేసే ఏ పథకం, ఏ కార్యక్రమమైనా నిరుపేదల సంక్షేమం కోసమే. దివ్యాం గులకు అండగా నిలబడాలనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళల కోసం తెచ్చిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటివరకూ 52 కోట్ల ప్రయాణాలు జరిగాయి. దివ్యాంగ శక్తితో లక్షల మందికి మేలు జరుగుతుంది. దివ్యాంగ సమస్యలపై ఎప్పుడూ పోరాటాలు చేసే మంద కృష్ణమాదిగ, గోనుగుంట్ల కోటేశ్వరావులను అభినం దించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

వాత్సల్యమూర్తి భువనమ్మ

పేదల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వమిది
దివ్యాంగులకు ఇంకా మేలు చేకూరుస్తాం… దానికి కొంచం సమయం పడుతుంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత దివ్యాం గుల సంక్షేమం కోసం కార్పొరేషన్ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. రూ.500గా ఉన్న పింఛను 2014లో టీడీపీ వచ్చాక రూ.1500 చేశాం. 2018-19 మధ్య రూ.3000కు పెంచాం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దివ్యాంగులకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ పెన్షన్ను రూ.6000 చేశాం. దివ్యాంగులను ఆదుకునే అవకాశాన్ని భగవంతుడు అందించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేశాం. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి.. పేదలను ఆదుకోవాలని ఆఎన్నికల్లో కలిశాం. 94 శాతం స్ట్రైక్ రేట్తో కూటమి అభ్యర్థులు గెలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాకుండా ఉంటే దివ్యాంగుల పింఛన్లు పెరిగేవి కాదు. దివ్యాంగ శక్తి పథకం వచ్చేది కాదు. స్కూటర్లు ఇచ్చినా ట్రై సైకిళ్లు అందించినా దివ్యాంగులను మిగతా వారికంటే ఎక్కువ ఆదరించాలి. దివ్యాంగులకు ల్యాప్ టాప్లు అందించాం. వారికి మరింత మంచి చేస్తాం.. మంచి చేసిన వారిని గుర్తుంచు కోవాలి. జరిగిన మంచిని 10 పది మందికి చెప్పాలి. సుస్థిర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పెద్దఎత్తున జరుగుతుంది. ప్రతినెలా పేదల సేవలో కార్యక్రమం ద్వారా తెల్లవారుజామునే పింఛను ఇస్తున్నాం. అప్పులు చేసినా, కేంద్రం నుంచి నిధులు తెచ్చినా పేదల సంక్షేమం కోసమే. పట్టుదలకు దివ్యాంగులు మారుపేరు. కఠోర శ్రమతో సాధించే వరకు నిద్రపోరు. దివ్యాంగులకు క్రీడ లు కూడా నిర్వహించాం… రాష్ట్రంలో ముందుకు వచ్చిన దివ్యాం గులకు శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వెళ్లేలా చేస్తాం. గత ప్రభుత్వం చాలా తప్పులు చేసింది. దివ్యాంగుల పేరుతో బాగున్న వారు కూడా పింఛన్లు, ఉద్యోగాలు పొందారు. ఇది చాలా నీచం బాధాకరమని ముఖ్యమంత్రి చెప్పారు.

మంచి ప్రభుత్వం కొనసాగాలి: దివ్యాంగులు
సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆత్మీయ విందుకు హాజరైన పలువురు దివ్యాంగులు తమ అభిప్రాయాలను… తమ భావాల ను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్తో పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఇలాగే కలిసి ఉండాలని… ప్రభుత్వం కొనసాగాలని కోరుకున్నారు. మంచి ప్రభుత్వం కొనసాగితే… తమకు సంక్షేమ పథకాలు ఇలాగే అందుతూ ఉంటాయని చెప్పారు. దివ్యాంగులుగా పుట్టినందుకు బాధగా ఉన్నా… ప్రభుత్వం తమను చూసుకుంటున్న విధానంతో సంతోషంగా ఉందన్నారు. తమను క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తు న్నారని… గత ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని పలువురు దివ్యాంగులు అభిప్రాయపడ్డారు. దివ్యాంగుల ముసుగులో కొందరు పింఛన్లు పొందుతున్నారని.. పింఛన్ల వెరిఫికేషన్ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అన్ని అవయవాలు సవ్యం గా ఉన్నారు కూడా దివ్యాంగులమని తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చు కుని ప్రభుత్వ కోటాలో ఉద్యోగాలు పొందుతున్నారని… అలాం టి వారిని గుర్తించేలా వెరిఫికేషన్ చేయాలని సీఎంకు కొందరు దివ్యాంగులు విజ్ఞప్తి చేశారు.

ఈ పథకం కోసం ఏటా రూ.207 కోట్లు
ఈ పథకం ద్వారా ఆర్టీసీలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. మొత్తం గా 21 కేటగిరీల బస్సుల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పి స్తూ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దివ్యాంగుల వెంట వచ్చే సహాయకులతో కలిపి మొత్తంగా 12.76 లక్షల మంది లబ్దిదా రులకు ప్రయోజనం కల్పించేలా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం కోసం ఏటా రూ.207 కోట్ల రూపాయల ప్రజా ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. దివ్యాం గుల శక్తి పథకానికి సంబంధించిన ఈ నిధులను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

Next Post

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం
ఆంధ్రప్రదేశ్

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆంధ్రప్రదేశ్

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం
ఆంధ్రప్రదేశ్

సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం

చైతన్యరధం
@ March 20, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist