- సంక్షేమం-అభివృద్ధి సమన్వయంతో ‘బ్రాండ్ ఆంధ్ర’గా రాష్ట్రం అవతరణ
అమరావతి (చైతన్యరథం): మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గురువారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీపరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దూరదృష్టి, మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి, పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరుస్తోందన్నారు.
యువత భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ చారిత్రాత్మక నిర్ణయమని పల్లా అన్నారు. 10,060 పోస్టులతో ప్రారంభమైన ఈ నియామక ప్రక్రియ ద్వారా గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్, ఉన్నత విద్య, పాఠశాల విద్య, ఏఈఈ తదితర విభాగాల్లో భారీ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడంలో లోకేష్ కృషి ఆదర్శప్రాయమని కొనియాడారు.
6.28 లక్షల ఉద్యోగాలు… ఉపాధి సృష్టిలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది
‘జాబ్ క్యాలెండర్కు ముందే కూటమి ప్రభుత్వం మొత్తం 6,28,347 ఉద్యోగాలు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, ఎంఎస్ఎంఈ రంగంలో 2,48,906, జాట్మీకాలు, స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా 1,46,627, పరిశ్రమల్లో 95,174 పుడ్ ప్రాసెసింగ్ 64,035, ఐటీ, ఎలక్ట్రానిక్స్ లో 13,866, పర్యాటక రంగంలో 5,028 ఉద్యోగాలు సృష్టించడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం’ అన్నారు..
‘తల్లికి వందనం’ నుంచి ‘స్త్రీ శక్తి’, ‘దివ్యాంగ శక్తి’ వరకు… సంక్షేమంలో సువర్ణ అధ్యాయం చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమానికి కొత్త నిర్వచనం తీసుకువచ్చామని పల్లా పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ ద్వారా రూ. 10,090 కోట్లను 67 లక్షలకు పైగా తల్లుల ఖాతాల్లో జమ చేసి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు. ‘స్త్రీ శక్తి’ ద్వారా 43 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించి రూ.1,532 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ‘దివ్యాంగ శక్తి’ కింద దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి, వారి జీవనంలో గౌరవం, స్వావలంబన పెంపొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘దీపం-2’ ద్వారా 3.64 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి రూ.2,891 కోట్లు వ్యయం చేశామని తెలిపారు.
‘అన్నదాత సుఖీభవ’ ద్వారా 46 లక్షల రైతులకు రూ.6,310 కోట్లు, పింఛన్ల రూపంలో 63లక్షల మందికి రూ.58,654 కోట్లు అందించామని చెప్పారు. మత్స్యకారులకు రూ.250 కోట్లు, ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్లు అందించడం ద్వారా ప్రతి వర్గానికి అండగా నిలిచామని తెలిపారు. అన్న క్యాంటీన్ల ద్వారా కోట్లాది భోజనాలు అందించామని చెప్పారు. ఇమామ్లు, మౌజన్లు, పాస్టర్లు, అర్చకులకు గౌరవ వేతనాలు పెంచి అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్ని చాటామన్నారు.
మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం
ఇమామ్, మౌజన్లకు రూ.180 కోట్ల ప్రకటన, రూ.45 కోట్లు విడుదల, బడ్జెట్లో రూ.6,090 కోట్ల కేటాయింపుతో మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం కూటమిదేనని వల్లా స్పష్టం చేశారు.
మౌలిక వసతుల్లో విప్లవాత్మక మార్పులు
రాష్ట్రవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మతులు, రూ.3వేల కోట్లతో కొత్త రహదారులు, గ్రామాల్లో 4వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేపట్టామని తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే ప్రాజెక్టులు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
విద్య, వైద్యం, డిజిటల్ పాలనలో నూతన దిశ
విద్యా రంగంలో సంస్కరణలు, టీచర్ల నియామకాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య రంగంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రతి కుటుంబానికీ ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా 900కు పైగా సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
పెట్టుబడుల వరద… ‘బ్రాండ్ ఆంధ్ర’ దిశగా
చంద్రబాబు విజన్, లోకేష్ గ్లోబల్ అవుట్డోచ్ వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కేవలం 20 నెలల్లోనే రూ.20లక్షల కోట్ల పెట్టుబడులు, 25 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు సృష్టించడం చరిత్రాత్మకమన్నారు.
వ్యవసాయం, నీటిపారుదలలో ప్రగతి
సాగునీటి ప్రాజెక్టులకు రూ.23,793 కోట్లు ఖర్చు చేసి, పోలవరం వంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు. రైతులకు మార్కెట్ సపోర్ట్, నీటి వనరుల పెంపు ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
కేవలం 22 నెలల్లోనే సూపర్ సిక్స్ హామీల్లో 95% అమలు చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకత్వం చంద్రబాబుదేనని పల్లా స్పష్టం చేశారు. లోకేష్ కృషితో యువతకు ఉపాధి, రాష్ట్రానికి పెట్టుబడులు, ప్రజలకు సంక్షేమం ఈ మూడు రంగాల్లో కూటమి ప్రభుత్వం అపూర్వ విజయాలు సాధించిందన్నారు. ఇక నుంచి కూడా ఇదే వేగంతో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించి ప్రతి కుటుంబానికీ మేలు చేసేలా కృషి చేస్తామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే పాలన కొనసాగుతుందని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.















