- 3.16 లక్షల హిట్లు.. 2.38 లక్షల మంది డౌన్లోడ్
అమరావతి (చైతన్యరథం): మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను పదో తరగతి విద్యార్థులు గణనీయంగా వినియోగించుకునితమ హాల్ టికెట్లను లక్షల సంఖ్యలో దీని ద్వారా పొందారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ప్రభుత్వం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 నెంబరు ద్వారా పొందే సదుపాయం కల్పించింది. ఈ సదుపాయాన్ని పదో తరగతి విద్యార్థులు పెద్ద ఎత్తున వినియోగించకుని హాల్ టికెట్లు పొందారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్కు పదో తరగతి విద్యార్థుల నుంచి మొత్తం 3,16,990 హిట్లు వచ్చాయి. అలాగే 2,38,728 మంది విద్యా ర్థులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడు చేసుకున్నారు. విద్యాశాఖ లీప్ యాప్ ద్వారా 65,477 మంది హాల్ టికెట్లు డౌన్లోడు చేసుకోగా, అత్యధికంగా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా 7,53,834 మంది హాల్ టికెట్లు పొందారు. పదో తగరతి పబ్లిక్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో డిజిటల్ స్పృహ పెరిగింది. గతానికంటే భిన్నంగా ఈ సారి విద్యార్థులు లక్షల సంఖ్యలో తమ హాల్ టికెట్లను డిజిటల్ రూపంలో ఆన్లైన్, మనమిత్ర, లీప్ యాప్ ద్వారా పొందారు. గతంలో ఎక్కువ మంది నేరుగా పాఠ శాలకు వెళ్లి ఫిజికల్గా హాల్ టికెట్లు పొందేవారు. ఇప్పడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.















