అమరావతి (చైతన్య రథం): భూమిని తల్లిలా భావించి… ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామ రైతు రోశయ్యకు నా ప్రణామాలు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ “ఎనభై ఏళ్ల వయసులో కేవలం 75సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ… నెలకు రూ.20 వేలకుపైగా ఆర్జిస్తున్న రోశయ్య విజయగాధ స్ఫూర్తిదాయకం. 2016లో ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నాడు తీసుకున్న చర్యలతో ప్రేరణపొంది ప్రకృతి సాగు మొదలుపెట్టిన రోశయ్య.. కషితో సాధిస్తున్న విజయాలు ఆదర్శం. రోశయ్యకు హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.















