అమరావతి (చైతన్య రథం): రికార్డు స్థాయిలో ఒక్కరోజే 6160 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తితో కొత్త చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. “కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో విద్యుత్‌రంగం పుంజుకుని వెలుగులు జిమ్ముతోంది అనేందుకు ఈ ఘనత సాక్ష్యం. జెన్కో ప్రాజెక్టుల గరిష్ట సామర్థ్యం 6610 మెగావాట్లు కాగా…. ఈనెల 11న 6160 ఉత్పత్తితో 93.19 శాతం ఉత్పత్తిని చేరుకోవడం గొప్ప విషయం. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన జెన్ కో ప్లాంట్ల కార్మికులకు, ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు, శాఖా మంత్రికి శుభాకాంక్షలు. విద్యుత్‌రంగంలో రానున్న రోజుల్లో సాధించే అద్భుత విజయాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.














