- తాడేపల్లి రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన
- రూ.294.20 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మాణం
మంగళగిరి(చైతన్యరథం): తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారం అయింది. ఇచ్చిన మాటను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాడేపల్లిలో ప్రకాశం బ్యారేజీ దిగువన 0.9 కి.మీ నుంచి 2.610 కి.మీల వరకు కృష్ణా నది కుడివైపు రూ.294.20 కోట్లతో వరద రక్షణ గోడను నిర్మించ నున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి లోకేష్ పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు కేవలం ఏడాది కాలంలోనే రూ.294.20 కోట్ల పరిపాలన అనుమతులు సాధించడమే కాకుండా టెండర్ ప్రక్రియను కూడా పూర్తిచేశారు. భవిష్యత్‌లో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసె క్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పట్టిష్టమైన డిజైన్‌తో రిటై నింగ్ వాల్‌ను నిర్మించనున్నారు.
కేవలం సాధారణ గోడ కాకుండా భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1,920 పైల్స్ వేసి, పైల్- రాఫ్ట్ సాంకేతికతతో భూకంపాలను, నీటి ఉధృతిని తట్టుకునేలా నిర్మించనున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయి తే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతా ల్లో నివసించే దాదాపు 50 వేల మంది ప్రజలు వరద భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అమరావతి రాజధాని పరిధిలోని కీలక ప్రాంతాలకు, జాతీయ రహదారి-65కు రక్షణగా రిటైనింగ్ వాల్ నిలవనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూ రు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు దాసరి కృష్ణ, తాడేపల్లి టౌన్ అధ్యక్షుడు వల్లభ నేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.














