- క్లసర్స్‌ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం
- ఏపీలో ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సహిస్తోంది
- శాసనమండలిలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లసర్స్‌ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల వివరాలు, ఈఎమ్ సీలో పరిశ్రమలకు ఇప్పటికే కేటాయించిన భూవిస్తీర్ణం, ఖాళీగా ఉన్న భూవిస్తీర్ణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. వీటి వివరాలు ఇవ్వడం జరిగింది. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది కాబట్టే ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని కేంద్రం కూడా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ఏసిప్ అనే సంస్థకు భూములు కేటాయించడం జరిగింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లసర్స్‌ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం. చిన్న, చిన్న సమస్యలు ఏమైనా ఉంటే యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.













