- అంగన్వాడీలకు కూటమి అండగా ఉంటుంది
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
గాజువాక(చైతన్యరథం): సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించారు. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలకు ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తుచేశారు. వారి డిమాండ్లను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తుందని తెలిపారు. వైసీపీ నాయకుల మాయ మాటల ఉచ్చులో పడొద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగ న్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేప డుతున్న తరుణంలో ఇలా ఉద్యమం చేపట్టడం భావ్యం కాదన్నా రు. గత వైకాపా పాలనలో గాడితప్పిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దు తున్న కూటమి ప్రభుత్వంపై విపక్షాలు విషం చిమ్ముతూ ఉద్యమాలకు ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు.
అంగన్వాడీ కేం ద్రాలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత కూటమిదేనన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో శనివారం కాకినాడలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రమాద వార్త తెలియగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లు స్పందించి వెంటనే అక్కడకు వెళ్లారని ఇది నిజమైన ప్రజా సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ సమ న్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, విల్లా రామ్మోహన్ కుమార్, బలగా బాలునాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు













