- 24 గంటల్లోనే డబ్బు జమ చేస్తున్నట్టు వెల్లడి
ఆత్మకూరు(చైతన్యరథం): రైతులకు గిట్టుబాటు ధర కల్పించ డం లక్ష్యంగా సంగం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. పౌరస రఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి అధికారులతో ఏర్పాట్లు, ధాన్యం సేకరణ విధానం, నగదు చెల్లింపుల ప్రక్రియపై సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసా య రంగానికి తమ ప్రభుత్వం అగ్రతాంబూలం వేస్తోందని, రైతు లకు మద్దతు ధర అందించడమే కాకుండా బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ ధర దక్కేలా ముందుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంగంలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి గుర్రప్ప, పౌర సరఫరాల సంస్థ డీఎం అర్జున్‌రావు, డీఎస్‌వో లీలారాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జనార్దన్ నాయుడు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
బైపాస్ రోడ్డు నిర్మాణం ఆకస్మిక తనిఖీ
ఆత్మకూరులో ఆంజనేయ స్వామి గుడి సమీపంలో బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆకస్మికం గా తనిఖీ చేశారు. అధికారులతో కలిసి రోడ్డు పనులను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పనుల్లో మరింత వేగం పెంచి రహదారి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం కాన్వాయ్‌ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చిన స్థానిక గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.













