- హెరిటేజ్, వీఎసఆర్‌కు సంబంధం లేదు
- అవి నిరాధార ఆరోపణలేనని వ్యాఖ్య
అమరావతి(చైతన్యరథం): హెరిటేజ్‌కి.. వీఎసఆర్ ఏవియేషన్ కి ఎలాంటి సంబంధం లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి వివేకారెడ్డిని చంపి ఆ కత్తి తమ చేతిలో పెట్టారు..ఇప్పుడు కూడా వీఎసఆర్ ఏవియేషన్‌పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అలాంటివేనని వ్యాఖ్యానించారు. హెరిటేజ్ ఫిన్ లీస్ 1996లో స్థాపించిన సంస్థ అని చెప్పుకొచ్చారు. 2022 లో వీఎసఆర్ ఏవియేషన్ స్థాపించారని ప్రస్తావించారు. బుధవా రం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి లోకేష్ చిట్‌చాట్ చేశారు. హెరిటేజ్ ఫిన్‌లీస్ వద్ద ఫైనాన్స్ తీసుకుంది.. అనేక ఇతర సంస్థల మాదిరిగానే వీఎసఆర్ కూడా ఫైనాన్స్ తీసుకుందని స్పష్టం చేశారు. ఆ రోజు తాము అధికారంలోకి వస్తామని, తమ ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని, మహారాష్ట్ర దివంగత మాజీ డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ వీఎసఆర్ ఫ్లైట్ ఎక్కుతారని, అది యాక్సిడెంట్‌కు గురవుతుందని తాము కలగన్నామా? తాము జ్యోతిష్యులమా? అని ప్రశ్నించారు. వీఎసఆర్ ఏవియేషన్ వ్యవహా రంపై పూర్తి వివరాలు మీడియాకు అందిస్తానని చెప్పుకొచ్చారు. జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణలకు తానెందుకు సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమున్న ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం తాము చెబుతామని పేర్కొన్నారు.
బొత్సకు స్ట్రాంగ్ కౌంటర్..
చిల్లర దొంగలను పట్టుకుని..గజదొంగలను వదిలేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంటే జగన్ గజదొంగ అని బొత్సా చెబుతున్నారా? జగన్‌ను పట్టుకోమని ఆయన చెబుతున్నా రా? అని నిలదీశారు. సిట్ అధికారుల విచారణలో తేలిందంతా అదే కదా అని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో తమపై ఆరుకు పైగా కేసులు పెట్టారని.. ఫైబర్‌నెట్, స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక, అసైన్‌మెంట్ భూములపై కేసులు పెట్టారని తెలిపారు.
గవర్నర్‌కు ఆధారాలు ఎందుకు చూపలేదు..
చార్జిషీట్ దాఖలు చేసేటప్పుడు కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం పొందాలి. మంత్రులకు అయితే గవర్నర్.. ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. గవర్నర్‌కు ఆధారాలు ఎందుకు చూపలేదని, ఒక్క ఆధారమైన చూపారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ హయాంలో పెట్టినవన్నీ తప్పుడు కేసులేనన్నారు. ఎమ్మెల్యేలకు రెసిడెన్షియల్ క్లాసులు పెట్టాం. రెండురోజుల పాటు వారంతా పార్టీ కార్యాలయంలోనే ఓరియెంటేషన్ క్లాస్‌లో ఉండాలని సూచించారు. ఈ ఒరియం టేషన్‌కి ప్రిన్సిపాల్ సీఎం చంద్రబాబు..మేమంతా విద్యార్థులమేనని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగే సమావే శాలు రాజకీయా లకు అతీతం..ఫ్యామిలీ కాన్సెప్ట్‌లోనే ఇది జరుగుతుందని వివరిం చారు. ఈ భేటీలో రాజకీయ ప్రస్తావన లేదని స్పష్టం చేశారు.














