చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

ఈ ప్రాజెక్టులతో 22,407 మందికి ఉద్యోగావకాశాలు

by చైతన్యరధం
Feb 19, 2026 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పెట్టుబడుల సాకారంపై నిరంతరం దృష్టి
  • ఇకపై ప్రతీ నెలా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
  • 15వ ఎసఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు
  • 27 ప్రాజెక్టులు, రూ.29,021 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
  • ఈ ప్రాజెక్టులతో 22,407 మందికి ఉద్యోగావకాశాలు

అమరావతి (చైతన్య రథం): స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రాతిపదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులు త్వరితగతిన కార్యరూపం దాల్చాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటివరకు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల యాజమాన్యాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేసింది. సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, సీఎస్ కె.విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన 27 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎసఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 15వ ఎసఐపిబి సమావేశం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 22,407 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలైన గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్‌వంటి మెగా ప్రాజెక్టులు వరుసగా ఏర్పాటు కావాల్సి ఉందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. భూకేటాయింపులు జరిపినప్పటికీ నిర్ణీతకాల వ్యవధిలో పనులు ప్రారంభించని సంస్థలతో సంప్రదింపులు జరపాలని, నిర్మాణానికి ముందుకు రాకుంటే భూములు వెనక్కి తీసుకునేందుకు వెనకాడవద్దని చెప్పారు. దీనిపై మంత్రుల కమిటీ దృష్టి పెట్టి.. అవసరమైతే అనుమతులు రద్దు చేయాలన్నారు. ప్రతీ ఒప్పందమూ వేగంగా సాకారం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేలా ఎన్నారైలను ఆహ్వానించాలని అధికారులను సీఎం నిర్దేశించారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులు మరిన్ని వచ్చేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అలాగే సొంత భూముల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

సంబంధితవార్తలు

No Content Available

ఐకానిక్‌గా విశాఖలో ‘భారత్ మండపం’
విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. సూర్యలంక, పోలవరం, పులికాట్, గండికోట, శ్రీశైలం, మదనపల్లి, హర్స్‌లీ హిల్స్‌వంటి క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆయా క్లస్టర్లలో షాపింగ్ మాల్స్, హోటల్స్‌వంటివి వస్తే పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకోవచ్చని చెప్పారు. విశాఖలో భారత్ మండపం వస్తోందని అది ఐకానిక్‌గా నిలిచేలా చూడాలన్నారు. దేశంలోనే అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్‌గా నిలవాలన్నారు. అలాగే ప్రతీ జిల్లాలో శిల్పారామాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ, ఏలూరులాంటి ప్రాంతాలు సహా రాష్ట్రంలో మరిన్ని హోటళ్లు, కన్పెన్షన్ సెంటర్లు రావాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. 50 వేల రూములు లక్ష్యం కావాలన్నారు. రాష్ట్రంలో జాతీయస్థాయి మెగా ఈవెంట్లు జరగాల్సి ఉందన్నారు. స్పోర్ట్స్ సిటీ, క్రియేటివ్ సిటీ, ఎకో సిస్టంలాంటివి రాష్ట్రంలో నెలకొనాలన్నారు. హెల్త్ టూరిజం కూడా గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు. తిరుపతిలో కలినరీ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుపై ఏపీలోని ఆహారరంగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని, హాస్పిటాలిటీలో డీమ్డ్ యూనివర్సిటీవంటి వాటిని ప్రమోట్ చేయాలని సీఎం చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లోనూ విప్లవాత్మకమైన మార్పులు అందిపుచ్చుకోవాలన్నారు. ఆక్వా కల్చర్‌లో వాల్యూ అడిషన్ జరిగినప్పుడే, అమెరికాకు ఎగుమతులు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. దీంతో డైరీ, పౌల్ట్రీ, లైవ్ స్టాక్, మీట్ ఎగుమతులూ పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతిని మ్యారేజ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దాలన్ని సీఎం సూచించారు.

ఉద్యోగాల వివరాలతో నైపుణ్యం పోర్టల్
ఇకపై ప్రతీ నెలా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేస్తానని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు. ఎసఐపీబీ ఆమోదం తెలిపిన ప్రాజెక్టులతోపాటు సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం జరిగిన ప్రాజెక్టుల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. కార్యకలాపాలు ప్రారంభించే తేదీని కూడా స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఇప్పటివరకు యువతకు లభించిన ఉద్యోగాల వివరాలు నైపుణ్యం పోర్టల్‌తో అనుసంధానించాలని సూచించారు. ఇంకా ఎన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో కూడా తెలిసేలా రియల్ టైమ్‌లో అప్డేట్ చేయాలన్నారు. త్వరలో వేర్ హౌసింగ్ పాలసీని కూడా తీసుకురావాలని అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖ, విజయావాడ తిరుపతి నగరాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెద్దఎత్తున ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు 15సార్లు ఎసఐపీబీ సమావేశాలు జరగ్గా మొత్తం రూ.9,03,726 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 8,58,082 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

15వ ఎస్ఐపీబీలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు:
1. యశస్వ పవర్ ఎలఎల్‌పీ. శ్రీ సత్యసాయి జిల్లాలో సోలార్ విద్యుత్ పార్క్. రూ.1,200 కోట్ల పెట్టుబడి, 690 మందికి ఉద్యోగాలు.
2. క్రోమా ఆటార్ ఇంటర్నేషనల్. పల్నాడు జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్. రూ.2,000 కోట్ల పెట్టుబడి, 5 వేల మందికి ఉద్యోగాలు.
3. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రీడ్ ట్వల్వ్ ప్రైవేట్ లిమిటెడ్. అనంతపురం జిల్లాలో పవర్ ప్రాజెక్టు. రూ.1,391 పెట్టుబడి, 200మందికి ఉద్యోగాలు
4. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రీడ్ థర్టీన్ ప్రైవేట్ లిమిటెడ్. అనంతపురం జిల్లాలో పవర్ ప్రాజెక్టు. రూ.1,391 పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు
5. రెన్యూ ఫోటో వోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. కర్నూలు జిల్లాలో సోలార్ హైబ్రీడ్ ప్రాజెక్టు. రూ.1,461 కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగాలు
6. ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్. కర్నూలు జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు. రూ.4,500 కోట్ల పెట్టుబడి, 3,100 మందికి ఉద్యోగాలు.
7. అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. విశాఖలో సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీ ప్రాజెక్టు. రూ.2,387.81 కోట్ల పెట్టుబడి, 1,000 మందికి ఉద్యోగాలు
8. కంపాస్ ఎంటర్ ప్రైజెస్‌ప్రైవేట్ లిమిటెడ్. తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటక ప్రాజెక్టు. రూ.101.28 కోట్ల పెట్టుబడి, 150మందికి ఉద్యోగాలు
9. ఆకేసియా హోటల్స్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. గుంటూరు జిల్లాలో పర్యాటక ప్రాజెక్టు. రూ.330 కోట్ల పెట్టుబడి, 372మందికి ఉద్యోగాలు
10. వీరాంజనేయ హాస్పిటాలిటీ. విశాఖలోని రుషికొండలో పర్యాటక ప్రాజెక్టు. రూ.89.32 కోట్లు పెట్టుబడి, 150 ఉద్యోగాలు
11. అక్షయ హోటల్స్ అండ్ రిసార్ట్స్. బాపట్ల జిల్లాలో టూరిజం ప్రాజెక్టు. రూ.54.02 కోట్ల పెట్టుబడి, 80 మందికి ఉద్యోగాలు
12. ఎకో ఐఎసఎలఈ రిసార్ట్స్. అల్లూరి జిల్లాలో పర్యాటక ప్రాజెక్టు. రూ.262.87 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు
13. సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, దివ్యశ్రీ హోల్డింగ్స్ కన్సార్షియం. తిరుపతిలో పర్యాటక ప్రాజెక్టు. రూ.1,226.32 కోట్ల పెట్టుబడి, 1,500 మందికి ఉద్యోగాలు.
14. కేపీసీ ప్రాజెక్ట్సు లిమిటెడ్. విశాఖలో టూరిజం ప్రాజెక్టు. రూ.280.51 కోట్ల పెట్టుబడి, 310 మందికి ఉద్యోగాలు
15. రుషికొండ బీచ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. విశాఖలో పర్యాటక ప్రాజెక్టు. రూ.424.20 కోట్ల పెట్టుబడి, 450 మందికి ఉద్యోగాలు
16. ఎస్వీఎస్ కనస్ట్రక్షన్స్. పర్యాటక ప్రాజెక్టు. రూ.104 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు
17. రాధికా వెజిటబుల్ ఆయిల్స్ లిమిటెడ్. విజయనగరం జిల్లాలో పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్. రూ.240 కోట్ల పెట్టుబడి, 304 మందికి ఉద్యోగాలు
18. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్. రూ.209.68 కోట్ల పెట్టుబడి, 35 మందికి ఉద్యోగాలు
19. ఏసీఈ ఇంటర్నేషనల్ లిమిటెడ్. చిత్తూరు జిల్లాలో డైరీ ప్రాసెసింగ్ యూనిట్. రూ.786.15 కోట్లు, 1,000 మందికి ఉద్యోగాలు.
20. వారీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అనకాపల్లి జిల్లాలో లీథియ ఆయాన్ సెల్స్ గిగా ఫ్యాక్టరీ. రూ.8,175 కోట్లు పెట్టుబడి, 3 వేలమందికి ఉద్యోగాలు
21. సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్. కర్నూలు జిల్లాలో సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్. రూ.314.66 కోట్లు, 780 మందికి ఉద్యోగాలు.
22. నాన్ గ్రీన్ మెట్ ప్రైవేట్ లిమిటెడ్. నాయుడుపేటలో లిథియం ఆయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ యూనిట్. రూ.1,366 కోట్లు, 340 మందికి ఉద్యోగాలు.
23. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్. అనకాపల్లి జిల్లాలో ఎండీఎఫ్ బోర్డు తయారీ యూనిట్. రూ.58.19 కోట్లు
24. సిరి బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎన్టీఆర్ జిల్లా పౌల్ట్రీ, ష్రింప్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్. రూ.37 కోట్ల పెట్టుబడి, 74 మందికి ఉద్యోగాలు.
25. సిరి బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. శ్రీ సత్యసాయి జిల్లాలో పౌల్ట్రీ, ష్రింప్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్. రూ.22 కోట్ల పెట్టుబడి, 37మందికి ఉద్యోగాలు
26. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్. నెల్లూరు జిల్లాలో డిఫెన్స్ ఎక్స్‌ప్లోజివ్స్ తయారీ యూనిట్. రూ.500 కోట్ల పెట్టుబడి, 2,050 మందికి ఉద్యోగాలు.
27. స్కై స్టోరేజ్ లిమిటెడ్. విశాఖ జిల్లాలో వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ యూనిట్. రూ.106 కోట్ల పెట్టుబడి, 285 మందికి ఉద్యోగాలు.

Tags: 15వ ఎస్ఐపీబీస్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
Previous Post

అదరహో.. ఐఎఫ్ఆర్

Next Post

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026

కార్యకర్త
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

స్పీడ్ ఆఫ్ రూల్!

చైతన్యరధం
@ February 19, 2026
ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ
ఆంధ్రప్రదేశ్

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్
ఆంధ్రప్రదేశ్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి

చైతన్యరధం
@ February 19, 2026
ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్
ఆంధ్రప్రదేశ్

ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్

చైతన్యరధం
@ February 19, 2026
ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్
ఆంధ్రప్రదేశ్

ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్

చైతన్యరధం
@ February 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-02-2026

కార్యకర్త
@ February 18, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

స్పీడ్ ఆఫ్ రూల్!

చైతన్యరధం
@ February 19, 2026
ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

చైతన్యరధం
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist