- రాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణే లక్ష్యమని స్పష్టీకరణ
- క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచిందని వెల్లడి
- ఏపీ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి అట్లాస్ విడుదల చేసిన సీఎం
అమరావతి (చైతన్యరథం): ఏపీలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశంలో కేన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించింద న్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రముఖ కేన్సర్ వైద్య నిపు ణులు, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి కాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ను సీఎం విడుదల చేశారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రూపొందించిన ఈ అట్లాస్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 2.9 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వ హించి నమోదు చేసిన వివరాలతో ఈ అట్లాస్ ను రూపొందించారు. విజన్ స్టేట్మెంట్ ద్వారా 2030 నాటికి అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్,మిషన్ స్టేట్మెంట్ ద్వారా ముందస్తు స్క్రీనింగ్ టెస్టులతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను తగ్గించేలా అట్లాస్ ద్వారా కార్యాచరణ చేపట్టనున్నారు. హెల్త్ ఎడ్యు కేషన్, క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన, ప్రివెన్షన్, స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ వంటివి క్యాన్సర్ కేర్ స్ట్రాటజీలో వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పురుషులు, మహిళల నుంచి నమోదు చేసిన సమాచారం ఆధారంగా చికిత్సలు, సర్జికల్, రేడియేషన్, మెడికల్ ట్రీట్మెంట్ వారీగా అట్లాస్లో వివరాలు పొందుపరి చారు.రాష్ట్రంలోని 28జిల్లాల్లో ఏ ప్రాంతం లో ఎంతమంది, ఏరకమైన క్యాన్సర్ రోగు లు ఉన్నారో గుర్తించేందుకు, స్థానికంగా చికిత్సలు అందించేందుకు వీలుగా సమా చారం తెలిసేలా ఈ అట్లాస్కు రూపకల్పన చేశారు.
ప్రస్తుతం ఏపీలో 32,657 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని… ఐసీఎంఆర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2030 నాటికి 20శాతం కేసులు పెరుగుదల ఉంటుందని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వివరించారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో క్యాన్సర్ అట్లాస్ రూపకల్పన జరిగిందని స్పష్టం చేశారు. రోగులను మ్యాపింగ్ చేసి 23 బోధనా సుపత్రులు, జిల్లా ఆస్పత్రుల ద్వారా రోగులకు డే కేర్ కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ చికిత్స అందించే అవకాశం ఉందని అన్నారు.మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కు హెచ్పీవీ వ్యాక్సినేషన్ అందించేందుకు వివిధ సంస్థలు, ఎన్ఆర్ఎల నుంచి కూడా సహకారం తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో క్యాన్సర్ వ్యాధిపట్ల అవగా హన పెరిగిందని.. ముందస్తు పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు.














