- ప్రతినిధులకు స్వయంగా ఆహ్వానం
- అందరితో కలిసి ఫొటోలు దిగిన మంత్రి
అమరావతి (చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పార్టీ పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తన హోదాను పక్కన బెట్టి ఒక విద్యార్థిలా పాల్గొన్నారు. తొలుత ఉదయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి వర్క్‌షాప్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్ సాయంత్రం వరకు కార్యాలయంలోనే ఉన్నారు. వర్క్ షాప్ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. విద్యార్థిలా మారి శిక్షణ తరగతులకు హాజరై వెనుక వరుసలో కూర్చొని సీనియన్ నేతలు చెప్పిన అంశాలను శ్రద్ధగా ఆలకించారు. అంతకుముందు వర్క్ షాప్‌లో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన పార్లమెంటరీ పార్టీ కమిటీ సభ్యులకు మంత్రి లోకేష్ స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి ఫొటోలు దిగారు.














