- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో సత్పలితాలు
- నమ్మకం, వేగంతో పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ
- 2035 నాటికి ‘డే-జీరో రెడీ స్టేట్’గా ఏపీ గుర్తింపే లక్ష్యం
- డీ-రెగ్యులేషన్ డ్రైవ్లో గత 18 నెలల్లో 50కి పైగా సంస్కరణలు
- ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ ఆధారిత వృద్ధికి కృషి
- దావోస్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్
దావోస్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ ప్రత్యేకత.. నమ్మకం, వేగం ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాయి.. పెట్టుబడులు వారాల వ్యవధిలోనే సాకారమయ్యేలా 2035 నాటికి ఏపీ ‘డే-జీరో రెడీ స్టేట్’గా గుర్తింపు పొందడమే లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ‘వృద్ధి వేగానికి ‘ (The Fast Lane: Investing at the Speed of Growth) ໑ ໑໐ దావోస్లో జరిగిన ఏపీ స్టేట్ రౌండ్ టేబుల్ సమా వేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మోడల్కు మారిందన్నారు. సమయం ఆదా చేయడమే పెట్టుబడిదారులకు పెద్ద లాభంగా మారు తోంది. అదే రాష్ట్రానికి ఆర్థిక పోటీలో ఆధిక్యత ఇస్తోంది. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB).. వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందు కు, వివిధ శాఖల మధ్య నెలకొన్న అంతర్గత సమస్యలు పరిష్కరించేం దుకు నెలకోసారి సమా వేశమవుతోంది. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులకు ఆమో దం తెలుపుతోంది. గ్లోబల్ పెట్టుబడిదారుల దృష్టిలో విధానపరమైన సౌకర్యాల కంటే అమలు, కాలపరి మితులపై స్పష్టతే ముఖ్యం. అందుకే మా గవర్నెన్స్ మోడల్ ముందే అంచనా వేయగల, కాలపరిమితితో కూడిన ఫలితాలపై ఆధారపడింది. ల్యాండ్, యుటి లిటీస్, పర్యావరణ అనుమతులు, స్కిల్లింగ్ వంటి అంశాల్లో వరుస అనుమతుల స్థానంలో ప్యారలల్ ప్రాసెసింగ్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రాజెక్టుల గ్రౌండింగ్కు పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించాం. ఇది నియంత్రణా క్రమశిక్షణను, సంస్థాగత పర్యవేక్షణను కాపాడుతూ మూలధన వేగాన్ని పెంచుతుందని మంత్రి లోకేష్ తెలిపారు.
2035 నాటికి “డే-జీరో రెడీ స్టేట్”గా గుర్తింపే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్లో నిర్ణయాలు వ్యక్తుల ఇష్టానుసారం కాకుండా వ్యవస్థ ఆధారంగా జరుగుతాయి. చట్టబద్ధత, డిజిటలైజేషన్, బాధ్యత.. వేగానికి బలం ఇస్తాయి. పెట్టుబడుల ప్రణాళికలోనే మానవ వనరుల సంసిద్ధతను అనుసంధానించడం జరుగుతోంది. దీంతో పెట్టుబడులు ఎంత వేగంగా వస్తాయో.. అదే వేగంతో నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి కూడా అందుబాటులోకి వస్తుంది. 2035 నాటికి ఆంధ్రప్రదేశ్ “డే-జీరో రెడీ స్టేట్”గా గుర్తింపు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే పెట్టుబడి నిర్ణయాల అనంతరం.. వారాల వ్యవధిలోనే అమలు ప్రారంభమవుతుంది. రియల్ టైం డేటాతో పనిచేసే యూనిఫైడ్ డిజిటల్ గవర్నెన్స్ ద్వారా జాప్యం, అవరోధాలను ముందుగానే గుర్తించి తదునుగుణంగా మార్పులు చేస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు.
గత 18 నెలల్లో 50కి పైగా సంస్కరణలు
మా ఆర్టీజీఎస్ ఆధారిత పాలనా విధానం.. విపత్తుల స్పందన, ఆక్వాకల్చర్ నిర్వహణ, ఆరోగ్య సంసిద్ధత, పౌర సేవల్లో ఇప్పటికే ప్రభావాన్ని చూపింది. చట్టబద్ధమైన కాలపరిమితుల విషయంలో డీమ్డ్ అప్రూవల్ను ప్రవేశపెట్టాం. తద్వారా పెట్టు బడిదారుల్లో అనిశ్చితి తొలగుతుంది. డీ-రెగ్యులేషన్ డ్రైవ్లో భాగంగా గత 18 నెలల్లో 50కి పైగా సంస్క రణలు చేపట్టాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. డీ-క్రిమినలైజేషన్ దిశగా మరిన్ని చర్యలు ప్రణాళికలో ఉన్నాయి. మేం రిస్క్ బేస్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్స్ను అనుసరిస్తున్నాం. దీంతో తక్కువ రిస్క్ ఉన్నప్రాజెక్టులను వేగంగా ఆమోదిస్తాం. అధిక ప్రభావం ఉన్న ప్రాజెక్టుల విషయంలో లోతైన పరిశీలన చేస్తాం. పర్యావరణ, సామాజిక భద్రతా చర్యలను ముందుగానే అమలు చేయడం ద్వారా సుస్థిరత మరింత బలపడుతోంది. సంస్థాగతంగా శాఖలకు స్పష్టమైన అధికారాలు, బాధ్యతలు ఇవ్వడం వల్ల వివిధ శాఖల మధ్య అవరోధాలు, ఫైల్ మూవ్మెంట్ తగ్గాయి. ఫలితంగా వేగవంతమైన నిర్ణయాలు, తక్కువ ప్రమాదం, దీర్ఘకాల స్థిరత్వం సాధ్యమవుతున్నాయి. ఇవే గ్లోబల్ పెట్టుబడిదారుల ప్రధాన అంచనాలుగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ ఆధారిత వృద్ధికి కృషి
పెట్టుబడులకు అనువుగా 175 నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమలు కొన్ని నగరాలకే పరిమితం కాకుండా ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ ఆధారిత వృద్ధి ద్వారా ఉద్యోగాలు, ఆదాయం, సంపద సమానంగా పంపిణీ జరుగుతుంది. ప్రతి పార్క్ స్థానిక వనరుల ఆధారంగా రూపొందిస్తున్నాం. అగ్రో-ప్రాసెసింగ్, సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకోసం ప్రత్యేక క్లస్టరింగ్ ఉంటుంది. పరిశ్రమలను ప్రజలకు దగ్గరగా తీసుకురావడం ద్వారా టైర్-2, టైర్-3 ప్రాంతాల్లో ఉపాధి సృష్టి జరుగుతుంది. వలసలు తగ్గుతాయి. ఎంఎస్ఎంఈ పార్కులు పెద్ద పరిశ్రమలకు సప్లైయర్ ఎకోసిస్టమ్స్న బలోపేతం చేస్తాయి. వాల్యూ చైన్ ఇంటిగ్రేషన్ ను మెరుగుపరుస్తాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
నమ్మకం, వేగంతో పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ
పరిశ్రమల వృద్ధి ద్వారా ఉద్యోగ, ఉపాధి సృష్టి, పేదరిక నిర్మూలనతోపాటు సమగ్ర ఆర్థిక వృద్ధి సాధ్య మవుతుంది. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతులు,మానవ వనరుల కల్పన ఏపీ ప్రత్యే కత. విధానాల స్థిరత్వం, సంస్థల విశ్వసనీయత కలిసి దీర్ఘకాలిక పెట్టుబడులకు గట్టి భరోసా ఇస్తున్నాయి. నమ్మకం, వేగం కలిసి ప్రపంచపోటీ వాతా వరణంలో ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక పెట్టుబడి గమస్థానంగా నిలబెడుతున్నాయని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కెర్నీ (Kearney) సీనియర్ పార్టనర్ సుకేతు గాంధీ, గూగుల్ ఏసియా పసిఫిక్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా, కాగ్నిజెంట్ గ్లోబల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, రెన్యూ (ReNew) చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా, తదితరులు పాల్గొన్నారు.
















