చిత్తూరు (చైతన్య రథం); సంస్కృతి, సంప్రదాయలు చాటి -చెప్పేలా నారావారిపల్లిలో భోగి పండగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం చంద్ర బాబు కుటుంబసమేతంగా ఈ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు భార్య భువనే శ్వరితో సహా కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. భోగి పండగ వేళ మనవడు దేవాన్స్, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, శ్రీభరత్ దంపతుల పిల్లలు ఎద్దుల బండిలో ఊరేగారు. ఈ సందర్భంగా ఎద్దుల బండిని బెలూన్లతో అందంగా అలంకరించారు. ఈ ఎద్దుల బండిపై ఊరంతా తిరిగారు. స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ స్వగ్రామానికి చేరుకున్న సంగతి తెలిసిందే.















