- ఆయన అసూయతో రగిలిపోతున్నారు
- కూటమి పాలనతో ప్రజలు ఆనందం
- ప్రపంచం మొత్తం ఏపీవైపు చూస్తోంది
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
- పెనుకొండలో సంక్రాంతి సంబరాలు
- ఎద్దుల బండ్ల పోటీల్లో పాల్గొన్న రైతులు
- ఆకట్టుకున్న గంగిరెద్దుల విన్యాసాలు
పెనుకొండ/శ్రీసత్యసాయి (చైతన్యరథం): సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలవుతున్న సంక్షేమాన్ని చూసి జగన్రెడ్డి ఓర్వలేకపోతున్నారని, ఈ భోగి నుంచైనా ఆయన బుద్ధి మారాలని ఆకాంక్షించారు. బుధవారం పెనుకొండ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆర్డీవో ఆనందరావు పాల్గొన్నారు. ఎద్దుల బండ్ల పోటీలు, ముగ్గుల పోటీలను, ఇతర క్రీడలను మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. కుటుంబసభ్యుల నడుమ సంక్రాంతి సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.
సీఎం చంద్రబాబు సంక్షేమ, అభివృద్ధి పాలనతో ప్రజల మరింత ఆనందంగా ఉన్నారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది. సమర్థవంతమైన నాయ కత్వంలో ఏపీకి భారీగా పెట్టుబడులు తరలొస్తున్నాయి. ప్రజలంతా ఆనందంగా ఉన్నా.. ఒకరు మాత్రమే అసూయతో రగిలిపోతున్నా రంటూ జగన్పై విమర్శలు గుప్పించారు. కొత్తదనాన్ని ఆహ్వానించ డమే భోగి ఉద్దేశమని, ఈ పండగ నుంచైనా జగన్ బుద్ధి మారా లని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి సవిత సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి క్యాంపు కార్యాలయం నుంచి జూనియర్ కళాశాలవరకూ ఎద్దుల బండిలో భారీ ర్యాలీగా వచ్చారు.
ఘనంగా సంక్రాంతి సంబరాలు
పెనుకొండ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సంక్రాంతి ఘనంగా జరిగాయి. వందలాది మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. మహిళలు అందమైన రంగవల్లుల ను అలంకరించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. ఎద్దుల బండ్ల పోటీలు, ఇతర క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహం పాల్గొన్నారు. మంత్రి సవిత క్రీడాకారులను ప్రోత్సహించారు. ముగ్గుల పోటీల్లో మొదటి బహు మతి గెలుచుకున్న శ్రీదేవికి రూ.10 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన పద్మావతికి రూ.5 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన అన సూయకు రూ.5 వేలు అందజేశారు. ఇద్దరికి కన్సొలేషన్ బహుమ తులు అందజేశారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సంక్రాంతి కానుకగా బహుమానాలు అందజేశారు. క్రీడలతో పాటు కోలాటం, చెక్కల భజన, గోరెవయ్యాల నాట్యం, పొట్టేళ్ల పందాలు, గాలిపటం ఎగరవేయడం, డోలు ప్రదర్శన వంటి సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి..















