- వివాదాలు వద్దు.. ఐక్యతే ముద్దు
- ఎవరికీ ఎటువంటి నష్టం ఉండదు.
- జలవనరుల మంత్రి నిమ్మల
అమరావతి(చైతన్యరథం): గోదావరి నదికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల -సాగర్ ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ సూచనల మేరకు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో సోమవారం రామానాయుడు ఈ విషయమై స్పందిం చారు. పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణా అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై మంత్రి నిమ్మల మాట్లాడుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాలు బాగుండాలని మొదటి నుంచీ కోరుకుంటున్నామని చెప్పారు. ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న మూడు వేల టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నాం. అపోహలు విడనాడి ఇప్పటికైనా సహకరించమని కోరారు.
ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణాకు ఎటువంటి నష్టం లేదని ముందునుండి మేం చెబుతూ నే ఉన్నాం.
తెలుగు రాష్ట్రాలు సోదర భావంతో కలసి అభివృద్ధి చెందాలనే సిఎం చంద్రబాబు ఆకాంక్ష అని మరో సారి గుర్తు చేశారు. గత 50 ఏళ్లలో గోదావరి వరదనీరు 1,53,000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసి పోయిన సంగతి గుర్తు చేసుకుం టూ ఆవేదన చెందారు. ఈ సంవత్సరం కూడా 4600 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోయిందని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత గోదావరి ఎగువన కాళేశ్వరానికి ఏమాదిరిగా అను మతి ఇచ్చారో, ఆ విధంగా దిగువన పోలవరం- నల్లమలసాగర్కు అనుమతి ఇవ్వమంటున్నాం. మా కోరిక సమంజ సమైనది, సహేతుకమైనది. సహజ న్యాయ సూత్రాలకు లోబడినదని తెలిపారు. పోల వరం దగ్గర వరద నీరును ఉపయోగించు కుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవా లి. లేదంటే సముద్రంలో ఉప్పునీటిలో కలిసిపోతుంది. అలాంటప్పుడు తెలంగాణ కు నష్టం జరిగే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు, గోదావరిలో పుష్కలంగా నీరు ఉందనే ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరాన్ని తెలంగాణ నిర్మాణం చేస్తు న్నా, మేము అడ్డుకోకుండా సహకరించా మన్నారు. పోలవరం-నల్లమలసాగర్ పూర్తయితే మనరాష్ట్ర ప్రయోజనాలు తీరిన తరువాత తెలంగాణకు సైతం ఉపయోగం ఉంటుందని తెలిపారు.













