- అనుకున్న సమయాని కన్నా ముందే జాతికి అంకితం
- వృథా జలాలను సద్వినియోగం చేసుకుందాం
- నదుల అనుసంధానంతో తెలంగాణకూ లబ్ధి
- పోలవరం కుడి కాల్వ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు నీరు
- ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి
- వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి అయ్యేలా చర్యలు
- 12 నెలల్లో ఆర్ అండ్ ఆర్ పనుల పూర్తికి యాక్షన్ ప్లాన్
- రాయలసీమ లిఫ్ట్ పేరుతో వైసీపీ రాజకీయం సిగ్గు చేటు
- సీమ రిజర్వాయర్లను నీళ్లతో నింపిన చరిత్ర మాది
- అనుమతుల్లేకుండా ఆరంభించారు..అడ్డగోలుగా దోచేశారు
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
- పోలవరం నిర్మాణ పనుల పరిశీలన, పూర్తిస్థాయిలో సమీక్ష
అమరావతి(చైతన్యరథం): పోలవరం ప్రాజెక్టును ఏదో ప్రాంతా నికి పరిమితమైన ప్రాజెక్టుగా చూడకూడదు.. ఈ ప్రాజెక్టు తెలుగు జాతికి నెర్వ్ సెంటర్ లాంటిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సైట్ మొత్తం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న టన్నెళ్లను.. డయాఫ్రం వాల్, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులను పరిశీలించారు. ప్రాజెక్టు సైటులో అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. నిర్మాణ పనులు ఎలా జరుగు తున్నాయోననే అంశాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు, కాంట్రాక్టు సంస్థకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వివిధ సూచనలు చేశారు. అనుకున్న సమయానికంటే ముందు గానే పోలవరం నిర్మాణ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసే లా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. గతంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తై ఉంటే… రూ.440 కోట్లతోనే నిర్మాణం జరిగేది. ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి అయ్యేది. 2019లో ప్రభుత్వం మారాక పోలవరం ప్రాజెక్టుకు చాలా నష్టం జరిగింది. డయాఫ్రం వాల్ దెబ్బతిన్నా కూడా నాటి ప్రభుత్వం దానిని గుర్తించడానికి చాలా సమయం తీసుకుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడా నికి ఆరేడేళ్లు జాప్యం అయింది. జాప్యం కావడం వల్ల ఖర్చులు పెరిగాయి. డయాఫ్రం వాల్ నిర్మాణానికి అదనంగా రూ.1000 కోట్ల భారం పడిరది. వచ్చే ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేస్తాం. పోలవరం మెయిన్ డ్యాం దాదాపు పూర్తి అయింది. ఎంబాంక్‌మెంట్ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం గ్యాప్-2 పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశిం చాం. ఇక పోలవరం ప్రాజెక్టులో ప్రధాన పనులను అన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకువస్తాం. వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
పునరావాస పనులకు యాక్షన్ ప్లాన్..
పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. ఈ మేరకు యాక్షన్ ప్లాన్ పెట్టుకుని… దానికి అనుగుణంగా పనులు చేపడతారు. పునరా వాసం కోసం అవసరమైన భూ సేకరణ కూడా త్వరితగతిన చేపట్టాలని సూచించాం. పోలవరం ప్రాజెక్టు కేంద్రంగా అతిపెద్ద ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ ఏర్పాటు చేయబోతున్నాం. పోలవరం కుడి, ఎడమ కాలువలు… టన్నెళ్ల ద్వారా కనెక్టివిటీ పెంచుతాం. ఎడమ కాలువ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసు కుంటున్నాం. విశాఖ వరకు పోలవరం నీళ్లను తీసుౖళ్తాం. విశాఖ, అనకాపల్లి జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం. అలాగే పోలవరం కాలువల ద్వారా పారే గోదావరి జలాలతో దారి పొడుగునా ఉన్న మైనర్ ఇరిగేషన్, చెక్ డ్యాంలను నింపుతూ వెళ్తాం. ఇక పోలవరం కుడి కాల్వ ద్వారా గోదావరి జలాలను కొల్లేరు వరకు తీసుౖళ్లేలా ప్రణాళికలను సిద్దం చేస్తున్నాం. ఐదేళ్ల కాలంలో గత ప్రభుత్వం కేవలం 2 శాతం పనులు మాత్రమే పూర్తి చేసింది. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం 72 శాతం పనులు పూర్తి చేసింది. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో ముంచేసింది… నిద్రలేని రాత్రులు గడిపా. అంతగా పోలవరం ప్రాజెక్టు నా మనస్సుకు దగ్గరగా ఉంది. పట్టిసీమ ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. పట్టిసీమ లేకుంటే రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. నాటి ప్రభుత్వంలో పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేయగలిగాం. కృష్ణా డెల్టాకు నీరు అందించగలిగాం. గోదా వరి నీళ్లను కృష్ణా డెల్టాకు తీసుకువెళ్లాం. అక్కడ నీటిని పొదుపు చేసి సీమకు కృష్ణా జలాలు వెళ్లేలా చేశాం. దీని వల్ల రాయల సీమకు నీటిని తరలించడం సాధ్యమైంది. రాయలసీమలో రిజర్వా యర్లు అన్నింటినీ నింపాం. ఉద్యాన రంగం అభివృద్ధి చెందు తోంది. పోలవరం పూర్తి కావాలి.. నదులు అనుసంధానం చేయా లి.. కరువు రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి… ఇది నా కల అని వివరించారు.
ప్రజా ప్రయోజనాల విషయంలో రాజకీయాలు తగదు
2014-19 మధ్య కాలంలో ఇరిగేషన్ కోసం రూ. 65 వేల కోట్లు ఖర్చు పెట్టాం.. వైసీపీ కేవలం రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టింది. రాయలసీమలో 2014-19 మధ్య కాలంలో రూ. 12 వేల కోట్లు ఖర్చుపెట్టాం… వాళ్లు కేవలం రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని ప్రతిపక్షంలో ఉండగా నేను పర్యటనలు చేస్తుంటే… నన్ను నాటి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం నలుమూ లలకు నీటిని అందించేలా ప్రణాళిక చేసుకోవచ్చు. సమర్ధ నీటి నిర్వహణతో 368 టీఎంసీల నీళ్లు రాయలసీమ రిజర్వాయర్లల్లో ఉన్నాయి… చాలా సంతోషంగా ఉంది. ఒక పంటకు నీళ్లవ్వలేని నెల్లూరు జిల్లాలో రెండు పంటలకు నీరు ఇచ్చే పరిస్థితి వచ్చింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయడం సరి కాదు. తెలంగాణలో దేవాదుల, కల్వకుర్తి, మాధ వరెడ్డి లిఫ్ట్ నేనే స్టార్ట్ చేశాను. కృష్ణా డెల్టా ఆధునీకరణతో 20 టీఎంసీల నీటిని పొదుపు చేసి…బీమా లిఫ్ట్ పూర్తి చేశాం. ఆర్డీఎస్‌కు నీళ్లు రాకపోతే..జూరాల నుంచి లింక్ కెనాల్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 40 వేల ఎకరాలకు నీళ్లందించాం. గోదావరి పైనా తెలంగాణలో అలీసాగర్, గుత్ప ప్రాజెక్టులు చేపట్టాం. హైదరాబాద్ నగరానికి సాగర్ జలాలు అందించాం. తెలుగుజాతి కోసం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి.. దేవాదుల ప్రాజెక్టు విస్తరించుకుంటే ఇబ్బంది లేదు. పోలవరం నీళ్లను మేం వాడు కుంటే అభ్యంతరం వ్యక్తం చేయడం సబబేనా? పోలవరం నీళ్లను వినియోగించుకుని కృష్ణా జలాలను పొదుపు చేసుకుం టున్నాం. ఈ పొదుపు చేసిన నీటిని సీమకు మళ్లిస్తున్నాం… అన్నీ కలిసి వస్తే అవసరమైతే తెలంగాణ కూడా నీళ్లు ఇవ్వవ చ్చు అని చంద్రబాబు వెల్లడిరచారు.
అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమవుతుందా?
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఓ అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందా.? రూ.3825 కోట్లను రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు మంజూరు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాయల సీమ లిఫ్ట్ ప్రాజక్టు పనులను ప్రారంభించారు. సరైన అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారని జరిమానా కూడా పడిరది. ఆ పనులను ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించింది. రూ. 900 కోట్లు కాంట్రాక్టరుకు చెల్లించారు. అనుమతుల్లేని ప్రాజెక్టులు మొదలు పెట్టి రూ.2500 కోట్లు చెల్లింపులు జరి పారు. విచ్చలవిడిగా, అడ్డగోలుగా పనులు చేశారు. మచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా సీమకు నీటిని తరలించే అవకాశం ఉన్నా… 34 టీఎంసీల నీటిని తరలిస్తామంటూ మరో ప్రాజెక్టు చేపట్టారు. వ్యవస్థలను ట్రాక్‌లో పెట్టే చేస్తే బురద జల్లుతున్నారు. హంద్రీ-నీవా ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చాం… కుప్పం వరకు నీళ్లు పారించాం. సీమలో ప్రాజెక్టులన్నింటికీ నీళ్లతో నింపాం. ఎప్పుడూ నీళ్లు చేరని బ్రహ్మం సాగర్ రిజర్వాయర్‌కూ నీళ్లను పంపించాం. నాపై బురద జల్లితే..వారికే నష్టం. దేశంలో నదు ల అనుసంధానం జరగాలనేది నా కోరిక. సముద్రంలోకి వృథాగా పోయే నీళ్లను వాడుకోగలిగితే.. మేలు జరుగుతుంది. తెలంగాణలో వరదలు వస్తే ఏపీని ముంచెత్తుతాయి. సముద్రం లోకి పోయే నీళ్లను వినియోగించుకుంటే ఆటో పైలెట్ విధానంలో అభివృద్ధి జరుగుతుంది. నా రాజకీయ జీవితంలో చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి.. పూర్తి చేశాను. ఏపీలో 90 శాతం ప్రాజెక్టులు తెలుగుదేశం చేపట్టినవే. కొంతమందికి ప్రాజెక్టులు అర్థం కావు… కానీ రాజకీయం మాత్రం చేస్తారు. తెలుగుజాతి అంతా ఒకటే. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని కోరారు. సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారథి, నాదెండ్ల మనోహర్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












